News February 19, 2025
స్టార్టప్‌ల వృద్ధిలో టీ-హబ్ కీలకపాత్ర: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలోని ప్రఖ్యాత ఇన్నోవేషన్ కేంద్రం టీ-హబ్ బ్రెజిల్‌కు చెందిన హబ్ ఆఫ్ గోయాస్ సంస్థతో ఎంఓయూ చేసుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణలోని స్టార్టప్‌లు బ్రెజిల్ మార్కెట్‌లో అవకాశాలు పొందేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. అలాగే 2 దేశాల స్టార్టప్ ఎకోసిస్టమ్ మరింత బలోపేతం కానుందన్నారు. స్టార్టప్‌ల వృద్ధిని ప్రోత్సహించడంలో టీ-హబ్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు.
Similar News
News March 28, 2025
KMR: చెట్టుకు కట్టేసి కొట్టారు (UPDATE)

దోమకొండ మండలం చింతామణి పల్లి గ్రామంలో గురువారం దారుణం చోటు చేసుకుంది. రమేశ్ అనే వ్యక్తిని పలువురు వ్యక్తులు చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాల పాలైన రమేశ్‌ను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఓ కారు అమ్మకం విషయంలో గొడవ జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
News March 28, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 28, 2025
‘పాపికొండల నుంచి ధవళేశ్వరం వరకు పర్యాటకంగా అభివృద్ధి’

పాపికొండల నుండి ధవళేశ్వరం వరకు పర్యాటకంగా హోటల్స్ ఏర్పాటుచేయడం, పోలవరం ప్రాజెక్ట్ వద్ద ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు, పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. బట్రస్ డ్యాం పూర్తికి రూ.82 కోట్ల ఖర్చు అవుతాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 886 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని సీఎంకి వివరించారు.