News January 26, 2025

స్టాళ్లను సందర్శించిన జనగామ కలెక్టర్

image

జనగామ జిల్లా కేంద్రంలోని ధ‌ర్మ‌కంచ‌లో గల మినీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్, వైద్య, గ్రామీణాభివృద్ధి, ఉద్యానవన, చేనేత, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ, పేదరిక నిర్మూలన శాఖ, మెప్మా, తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డీసీపీ, ఏఎస్పీ సందర్శించి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమ వివరాలను అడిగి తెలుసుకొని వారిని అభినందించారు.

Similar News

News September 16, 2025

సంగారెడ్డి: ఇన్‌స్పైర్ నామినేషన్ గడువు పెంపు

image

ఇన్‌స్పైర్ అవార్డ్స్ (Inspire Awards) నామినేషన్ గడువును సెప్టెంబర్ 30 వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా, విద్యార్థులకు సహకరించిన ప్రధానోపాధ్యాయులు, గైడ్ టీచర్లు, జిల్లా, డివిజన్, మండల మానిటరింగ్ కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News September 16, 2025

ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్ ఇదే!.

image

ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్‌తో మున్సిపాలిటీకి రూ.1,91,44,00లు, ఆర్థిక శాఖకు జీఎస్టీ రూపంలో రూ.34,45,920లు ఆదాయం లభించనుంది. మొత్తంగా ప్రభుత్వానికి రూ.2,25,89,920లు ఆదాయం సమకూరుతుంది. దసరా ఉత్సవాల్లో రెండవ మైసూరుగా పేరుగాంచిన ప్రొద్దుటూరులో ప్రతి దసరా సమయంలోనూ మున్సిపల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల మున్సిపాలిటీకి, జీఎస్టీ శాఖకు ఆదాయం లభిస్తోంది.

News September 16, 2025

రాష్ట్రంలో రోడ్ల కోసం రూ.868 కోట్లు మంజూరు

image

TG: రాష్ట్రానికి సెంట్రల్ రోడ్&ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద రూ.868 కోట్లు మంజూరైనట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ’34 రోడ్డు, వంతెన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఈ నిధులు మంజూరయ్యాయి. కనెక్టివిటీని పెంచడం, స్టేట్ రోడ్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం లక్ష్యంగా ఇవి చేపట్టాం. తెలంగాణలో రోడ్డు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, సమతుల్య ప్రాంతీయాభివృద్ధిపై కేంద్రం నిబద్ధతతో ఉంది’ అని తెలిపారు.