News January 26, 2025

స్టాళ్లను సందర్శించిన జనగామ కలెక్టర్

image

జనగామ జిల్లా కేంద్రంలోని ధ‌ర్మ‌కంచ‌లో గల మినీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్, వైద్య, గ్రామీణాభివృద్ధి, ఉద్యానవన, చేనేత, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ, పేదరిక నిర్మూలన శాఖ, మెప్మా, తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డీసీపీ, ఏఎస్పీ సందర్శించి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమ వివరాలను అడిగి తెలుసుకొని వారిని అభినందించారు.

Similar News

News February 13, 2025

అల్లూరి: ఒకే ఊరు.. రెండు మండలాలు..!

image

తమ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని రాజవొమ్మంగి మండలం రాజుపేట గిరిజనులు కోరుతున్నారు. ఐదేళ్లలోపు 32మంది బాలలు ఉన్నారన్నారు. రెండు వీధులుగా ఉన్న తమ గ్రామంలో ఎగువవీధి కొయ్యూరు మండలంలోకి.. దిగువ వీధి రాజవొమ్మంగి మండలంలోకి వస్తుందని చెప్తున్నారు. అనేకసార్లు రెండు మండలాల అధికారులకు విన్నవించుకున్నామని తెలిపారు. చేసేదిలేక చిన్నారులను పనుల వద్దకు తీసుకుపోతున్నామని తమ ఆవేదనను వెలిబుచ్చుకున్నారు.

News February 13, 2025

19న BRS విస్తృతస్థాయి సమావేశం

image

TG: ఫిబ్రవరి 19న బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని KCR నిర్ణయించారు. ఈ సమావేశంలో పార్టీ రజతోత్సవాలు, సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనున్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై KCR అధ్యక్షతన జరిగే భేటీలో సమాలోచనలు చేయనున్నారు.

News February 13, 2025

భద్రాద్రిలో విషాదం.. ఇద్దరి దుర్మరణం (UPDATE)

image

భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు వద్ద లారీ, బైక్ ఢీకొన్న ఘోర <<15448249>>రోడ్డు ప్రమాదం<<>>లో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు చింతగుప్ప పరిధిలోని సుజ్ఞానాపురం గ్రామానికి చెందిన  భూక్యా హరిబాబు(40), భూక్యా సోమ్లా(36) లుగా గుర్తించారు. అకాల మరణంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!