News January 29, 2025
స్టీల్ ఉద్యోగులు, కార్మికులతో చర్చిస్తాం: శ్రీనివాస వర్మ

స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులతో భేటీ కానున్నట్లు కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామితో స్టీల్ ప్లాంట్‌ను గురువారం సందర్శించనున్నట్లు వెల్లడించారు. ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత కష్టమైన పరిస్థితుల్లోనూ ప్రభుత్వ పెద్దలను ఒప్పించి, నచ్చజెప్పి ప్యాకేజీ తీసుకొచ్చామన్నారు.
Similar News
News February 10, 2025
వైసీపీ ముఖ్య నేతలతో గుడివాడ సమావేశం

విశాఖ వైసీపీ ఆఫీసులో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో సోమవారం ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లాలో ఇటీవల నియమించిన అనుబంధ సంఘాల అధ్యక్షులతో పలు విషయాలపై చర్చించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు, రమణికుమారి ఉన్నారు.
News February 10, 2025
విశాఖ: ముగిసిన నామినేషన్ల గడువు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు నేటితో ముగిసిందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఇప్పటి వరకు మొత్తం 10 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే వీరి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ 11న, ఉప సంహరణ 13న ఉంటుంది. పరిశీలన, ఉపసంహరణ పూర్తయిన తర్వాత బరిలో ఎంత మంది నిలుస్తారన్నది తేలనుంది.
News February 10, 2025
నిర్మలా సీతారామన్‌తో విశాఖ ఎంపీ భేటీ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను విశాఖ ఎంపీ శ్రీభరత్ సోమవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్యాకేజీకి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ బడ్జెట్‌లో 12 లక్షల వరకు వచ్చే జీతాలకు ఆదాయపు పన్ను ఉపశమనం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆదాయపు పన్ను కుదించడంతో మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు.