News January 21, 2025

స్టీల్ ప్లాంట్‌ను కాపాడింది చంద్రబాబే: మంత్రి కొల్లు

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడింది చంద్రబాబే అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ వల్లే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం భూదోపిడి కోసమే స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని నడిపారని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్‌కు ప్రధానితో శంకుస్థాపన చేయించడం జరిగిందన్నారు.

Similar News

News February 14, 2025

విశాఖ: భర్త వేధింపులకు నవ వధువు ఆత్మహత్య 

image

గోపాలపట్నంలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. నాగేంద్రబాబు, వసంత 11 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పోర్న్‌ వీడియోలకు బానిసైన నాగేంద్ర భార్య వసంతను అదేవిధంగా చేయాలని ఒత్తిడి చేసేవాడు. దీంతో మనస్తాపానికి గురైన వసంత శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని నాగేంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని KGHకి తరలించారు.

News February 14, 2025

పాత గాజువాకలో యాక్సిడెంట్.. ఒకరు స్పాట్‌డెడ్

image

పాత గాజువాక జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. గాజువాక పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 14, 2025

నేవీ క్వార్టర్స్‌లో మహిళ అనుమానాస్పద మృతి

image

నేవీ అధికారుల క్వార్టర్స్‌లో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ క్వార్టర్స్‌లో కమల అనే మహిళ కొన్ని సంవత్సరాలుగా ఓ అధికారి ఇంట్లో పని చేస్తుంది. వారు పని మీద బయటకు వెళ్లారు. మూడు రోజులుగా ఆమె ఇంట్లోనే ఉంటోంది. గురువారం పక్క ఫ్లాట్ వాళ్లు కిటికీలోంచి చూడగా ఆమె బట్టలు లేకుండా కింద పడి ఉంది. దీంతో సెక్యురిటీకి సమాచారం అందించారు. మల్కాపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!