News September 10, 2024
స్టీల్ ప్లాంట్ కార్మికులు రాస్తారోకో.. పరిస్థితి ఉధృతం
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అడ్డుకుంటున్న పోలీసులతో కార్మికులు తీవ్ర వాగ్వివాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు కార్మికులను పోలీసులు అరెస్టు చేసి వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు.
Similar News
News October 4, 2024
విశాఖ: ‘డ్రగ్స్ నియంత్రణపై శిక్షణ’
మాదకద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో పోలీస్ అధికారులు పనిచేయాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ సూచించారు. విశాఖలో గురువారం న్యూఢిల్లీకి చెందిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులతో 50 మంది పోలీస్ అధికారులకు డ్రగ్స్ నియంత్రణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిషనర్ మాటాడుతూ యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News October 4, 2024
విశాఖ జిల్లా TOP NEWS TODAY
* మాడుగుల నియోజకవర్గంలో 80 అడుగుల రోడ్డు.!
* ముంచింగిపుట్టులో గంజాయితో పట్టుబడ్డ మహిళలు
* ఏయూలో డిప్లొమో కోర్సులకు నోటిఫికేషన్
* విశాఖ పోర్టు.. సరికొత్త రికార్డు
* విశాఖ: ఇన్ స్టా గ్రామ్ ఖాతాను హ్యాక్ చేసిన వ్యక్తి అరెస్ట్
* డొంకరాయి జలాశయం వద్ద మొసలి హల్ చల్
* బుచ్చియ్యపేట: ఆవుల అక్రమ తరలింపు అడ్డగింత
* సీఎంతో భేటీ అయిన భీమిలి టీడీపీ ఇన్‌ఛార్జ్
* అల్లూరి జిల్లా ప్రజలకు పోలీసుల హెచ్చరిక
News October 3, 2024
విశాఖలో టెట్ పరీక్షకు 3439 మంది హాజరు
విశాఖలో గురువారం నిర్వహించిన టెట్ పరీక్షకు 3931 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 3439 మంది హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. మొత్తం 492 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. నగరంలో ఉదయం 5 కేంద్రాల్లోనూ మధ్యాహ్నం మూడు కేంద్రాల్లోనూ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ బుచ్చిరాజుపాలెం సెంటర్‌ను సందర్శించినట్లు తెలిపారు.