News March 15, 2025
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడంతో పవన్ పాత్ర కీలకం: కొణతాల

స్వార్థం అనేది లేకుండా రాజకీయాలు చేసే వ్యక్తి పవన్ అని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. ‘రాజకీయం లేకుండా సినిమాల్లో ఉండి ఉంటే ఎన్ని కోట్లు సంపాదించే వారో? కానీ ప్రజల కోసం పవన్ రాజకీయాల్లోకి కొనసాగారు. 11 ఏళ్లు నిర్విరామంగా పోరాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడంతో పవన్ కీలక పాత్ర పోషించారు. నిస్వార్థమైన పవన్ లాంటి వ్యక్తిని కాపాడుకోవాలి’ అని చిత్రాడలోని జనసేన ఆవిర్భావ సభలో అన్నారు.
Similar News
News December 7, 2025
ఆ లంబాడీలు ఎస్టీలు కాదు: హైకోర్టు

TG: 1956 తర్వాత మహారాష్ట్ర నుంచి వలస వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ లంబాడీలు ఎస్టీ క్యాటగిరీ కిందకు రాబోరని హైకోర్టు స్పష్టం చేసింది. తమ ఎస్టీ సర్టిఫికెట్ను రద్దు చేశారని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హాన్ దేవానంద్ కుటుంబం హైకోర్టుకు వెళ్లింది. 1950 నాటికి తెలంగాణలో నివసించే లంబాడీలు, వారి పూర్వీకులు, మహారాష్ట్ర నుంచి వచ్చిన లంబాడీలకు మాత్రమే ఎస్టీ క్యాటగిరీ వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
News December 7, 2025
ఖమ్మం: పంచాయతీ పోరులో ‘వాట్సాప్’ ప్రచారం జోరు

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. వారం రోజులే సమయం ఉండటంతో, అభ్యర్థులు ఓటర్లను నేరుగా కలవడంతో పాటు డిజిటల్ ప్రచారాన్ని ఆశ్రయిస్తున్నారు. సర్పంచ్, వార్డు అభ్యర్థులు ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసి, తమ గుర్తులు, ఫొ టోలతో పాటు గత సేవలు, భవిష్యత్తు హామీలను సందేశాల రూపంలో పంపుతూ పోటాపోటీగా గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
News December 7, 2025
ఖమ్మం: పంచాయతీ పోరులో హోం ఓటింగ్ ఉందా?

గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వయోవృద్ధులు, కదల్లేని దివ్యాంగుల కోసం అమలు చేసిన హోమ్ ఓటింగ్ సదుపాయంపై గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గందరగోళం నెలకొంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్నా ఈసారి ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ఆ వర్గాలలో ఆందోళన కనిపిస్తోంది. బీఎల్ఏల ద్వారా సమాచారం సేకరించి ఇంటికే సిబ్బందిని పంపి ఓటు వేసే అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు.


