News January 4, 2025

స్టీల్ ప్లాంట్: మోసానికి పాల్పడిన తండ్రి-కొడుకులకు జైలు శిక్ష

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో తండ్రి-కొడుకులకు న్యాయమూర్తి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ విశ్రాంత ఉద్యోగి పోతయ్య ఆయన కుమారుడు వెంకటరమణ ఉద్యోగాలు ఇప్పిస్తామని 50 మంది నుంచి రూ.63 లక్షలు వసూలు చేశారు. బాధితులు 2017లో స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Similar News

News November 23, 2025

విశాఖ: కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా గాయత్రి

image

కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం విశాఖ జిల్లా అధ్యక్షురాలిగా కాండవ గాయత్రి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు అడ్డాల వెంకటవర్మ నియామకపత్రం అందజేశారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. జిల్లా కమిటీ నియమకం పూర్తిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు.

News November 23, 2025

విశాఖలో నాన్‌వెజ్ ధరలు

image

విశాఖపట్నంలో ఆదివారం నాన్‌వెజ్ ధరలు గణనీయంగా పెరిగాయి. మటన్ కేజీ రూ.950కి, చికెన్ స్కిన్‌లెస్ రూ.280కి, విత్‌స్కిన్ రూ.250కి, శొంఠ్యాం కోడి రూ.300కి పలుకుతోంది. డజన్ గుడ్లు రూ.66కు లభిస్తున్నాయి. గత వారంతో పోలిస్తే అన్ని రేట్లు భారీగా పెరగడంతో కార్తీక మాసం ముగిసిన వెంటనే ఈ పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది.

News November 23, 2025

విశాఖలో కాంగ్రెస్ ప్రక్షాళన: డీసీసీ ఎన్నికలకు సన్నాహాలు

image

విశాఖలో డీసీసీ అధ్యక్షురాలు హాసిని వర్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులు హాజరయ్యారు. అధిష్టానం జిల్లాకో పరిశీలకుడిని నియమించిందని, త్వరలో డీసీసీ ఎన్నికలు నిర్వహించి అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను కమిటీలకే అప్పగిస్తామని తెలిపారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చి, రాబోయే ఎన్నికల్లో జీవీఎంసీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ధీమా వ్యక్తం చేశారు.