News November 1, 2024
స్టీల్ ప్లాంట్ రక్షణకై త్యాగాలకు సిద్ధం: వామపక్షలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో సదస్సును అల్లూరి విజ్ఞానం కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.లెనిన్ బాబు మాట్లాడుతూ విద్యార్థి, యువత భగత్ సింగ్ స్ఫూర్తితో ఆందోళనలతో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పోరాడుదామని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కోసం విద్యార్థి యువజన సంఘాలు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని తెలిపారు.
Similar News
News December 15, 2025
విశాఖ: టెట్ పరీక్షకు 10 మంది గైర్హాజరు

విశాఖలో సోమవారం రెండు కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 171 మంది అభ్యర్థులకు గానూ 161 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. 10 మంది గైర్హాజరు అయ్యారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ ఒక పరీక్ష కేంద్రంను తనిఖీ చేశారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో చెప్పారు.
News December 15, 2025
విశాఖలో పీజీఆర్ఎస్కు 299 వినతులు: కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు పరిష్కారం చూపాలని కలెక్టర్ హరేంద్రప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 299 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందినవి 132 ఉండగా, జీవీఎంసీ 76, పోలీస్ విభాగానికి సంబంధించినవి 24, ఇతర విభాగాలకు చెందినవి 67 ఉన్నాయి.
News December 15, 2025
విశాఖ: డిసెంబర్ 21న పల్స్ పోలియో

విశాఖలో డిసెంబర్ 21న పల్స్ పోలియో నిర్వహించనున్నారు. 5 సంవత్సరాలలోపు చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఇప్పటికే సూచించారు. జిల్లాలో 2,09,652 మంది ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు ఉన్నారు. వీరి కోసం ఇప్పటికే 1062 పల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల తల్లిదండ్రులు ఈ విషయన్ని గమనించాలని అధికారులు కోరారు.


