News November 1, 2024

స్టీల్ ప్లాంట్ రక్షణకై త్యాగాలకు సిద్ధం: వామపక్షలు

image

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో సదస్సును అల్లూరి విజ్ఞానం కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.లెనిన్ బాబు మాట్లాడుతూ విద్యార్థి, యువత భగత్ సింగ్ స్ఫూర్తితో ఆందోళనలతో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పోరాడుదామని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కోసం విద్యార్థి యువజన సంఘాలు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని తెలిపారు.

Similar News

News December 5, 2024

నేడు విశాఖ రానున్న సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే

image

సీఎం చంద్రబాబు నేడు విశాఖ రానున్న నేపథ్యంలో ఆయన పర్యటన షెడ్యూల్‌ను సీఎంవో తెలిపింది. ఈరోజు రాత్రి 9.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన టీడీపీ పార్టీ ఆఫీసుకు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. 6వ తేదీన విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలపై సీఎం సమీక్షిస్తారు.

News December 5, 2024

అనకాపల్లి: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

image

అనకాపల్లి జిల్లా పరిధిలో నేషనల్ హైవే, స్టేట్ హైవేలపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు SDPO శ్రావణి పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి నేషనల్ హైవే పై బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి ప్రమాదాలు జరగడానికి గల కారణాలను విశ్లేషించారు. లోటుపాట్లను తెలుసుకొని వాటిని సరిదిద్ది ప్రమాదాల నివారణకు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేస్తామన్నారు.

News December 4, 2024

సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన షెడ్యూల్

image

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 5న విశాఖ రానున్న విషయం తెలిసిందే. విశాఖలో సీఎం పర్యటన షెడ్యూల్‌ను సీఎంవో తెలిపింది. ఈనెల 5న సాయంత్రం 9.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్ కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 6వ తేదీన విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలపై సీఎం సమీక్షిస్తారు.