News May 22, 2024
స్టీల్ ప్లాంట్: 23న మిగిలిన వేతనాల చెల్లింపు

వేతనాల విషయమై స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ అఖిలపక్ష కార్మిక నేతలతో బుధవారం చర్చించారు. ఈ నెల 21న 50% జీతాలు చెల్లించడంతో మిగిలిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అడ్మిన్ భవనాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో సీఎండీ వారిని చర్చలకు ఆహ్వానించారు. ఈ నెల 23న మిగిలిన 50% వేతనాలు చెల్లిస్తామని సీఎండీ హామీ ఇవ్వడంతో కార్మికులు శాంతించారు.
Similar News
News November 17, 2025
ఆన్లైన్ మోసాలపై పోలీసుల సూచనలివే..

సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ పోలీసులు సూచించారు. తెలియని కాల్స్, ఇమెయిల్స్, మెసేజ్‌లను నమ్మవద్దని హెచ్చరించారు. బ్యాంకు సిబ్బంది ఎప్పుడూ OTP, PIN, CVV అడగరని తెలిపారు. అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయొద్దన్నారు. TeamViewer, AnyDesk వంటి రిమోట్ యాప్‌లు ఇన్స్టాల్ చేయవద్దని సూచించారు. ఒక్క నిర్లక్ష్యంతో పెద్ద నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

బంగ్లా చెరలో ఉన్న మత్స్యకారులు.. దీనగాథ

భోగాపురం మండలం కొండరాజుపాలెం సర్పంచ్ సూరాడ చిన్నా ఆధ్వర్యంలో మత్స్యకారులు విశాఖ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సముద్రంలో వేటకు వెళ్లగా బంగ్లాదేశ్ బోర్డర్లో ప్రవేశించడంతో 9 మందిని గతనెల 22న బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అరెస్టు చేసింది. అరెస్టు కాబడిన వారిలో సూరాడ అప్పలకొండ భార్య ఎనిమిది నెలల నిండు గర్భిణీగా ఉందని వెంటనే విడిపించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌కు మత్స్యకారులు కోరారు.