News March 2, 2025

స్టూవర్టుపురం ఉపాధ్యాయినిని ప్రశంసించిన చంద్రబాబు

image

బాపట్ల జిల్లా స్టూవర్టుపురానికి చెందిన తొలి ఎరుకలి సామాజికవర్గ మహిళా ఉపాధ్యాయిని సాతుపాటి ప్రసన్నశ్రీ. ప్రస్తుతం ఈమె రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. ఈ విషయంపై CM చంద్రబాబు ‘X’ వేదికగా స్పందించారు. ప్రసన్నశ్రీ కథ ఆమె విశేషమైన అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. ఆమె ప్రయత్నాలకు తగిన గుర్తింపు రావడం సంతోషాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.

Similar News

News November 18, 2025

ఐ-బొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలి.. నిర్మాత డిమాండ్

image

ఐ-బొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ నిర్మాత సి.కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులు కాకపోయినా సినిమా వాళ్లైనా చేయాలంటూ ఫిల్మ్ ఛాంబర్ నిర్వహించిన ప్రెస్‌మీట్లో వ్యాఖ్యానించారు. అలా జరిగితేనే ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారని తెలిపారు. తాను కడుపు మంటతో, బాధతో ఈ కామెంట్స్ చేస్తున్నట్లు చెప్పారు. కాగా సి.కళ్యాణ్ కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి మీ COMMENT?

News November 18, 2025

రైతు అభివృద్ధే లక్ష్యం: మార్నేని రవీందర్

image

హనుమకొండ డీసీసీబీ బ్యాంకులో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ స్నేహ శబరీష్, అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్యాక్స్(PACS) లను సాధారణ సేవా కేంద్రాలుగా అభివృద్ధి చేసి, గ్రామీణ ప్రజలకు స్థిర జీవనోపాధి కల్పించడమే సహకార రంగం లక్ష్యమని వారు పేర్కొన్నారు.

News November 18, 2025

ఖైదీని మార్చిన పుస్తకం!

image

మనిషి జీవితంపై పుస్తకాలు ఎంత ప్రభావం చూపుతాయో తెలిపే ఘటనే ఇది. అమెరికాకు చెందిన రెజినాల్డ్ డ్వైన్ బెట్స్ 17 ఏళ్ల వయసులో కార్ జాకింగ్ కేసులో జైలుపాలయ్యారు. ఏకాంత కారాగారంలో ఆయన ‘ది బ్లాక్ పోయెట్స్’ పుస్తకం చదివి స్ఫూర్తిపొందారు. 2020లో ఆయన ‘ఫ్రీడమ్ రీడ్స్’ అనే సంస్థను స్థాపించి అమెరికాలోని జైళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నారు. అలా 500 పుస్తకాలతో కూడిన 35 కొత్త లైబ్రరీలను ప్రారంభించారు.