News March 25, 2025
స్టేట్ చీఫ్‌గా ఎంపీ ఈటల రాజేందర్..?

ఉగాదిలోపు తెలంగాణ BJPకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారం ఆ పార్టీ శ్రేణుల్లో ఊపందుకుంది. రెండు రోజుల్లోనే దీనిపై స్పష్టత రానుంది. అయితే BC నేతను నియమిస్తారా.. లేక OCకి దక్కుతుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాగా పరిశీలనలో ఈటల రాజేందర్ ముందువరసలో ఉన్నట్లు తెలిసింది. MP అర్వింద్, DK అరుణ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. బండి సంజయ్‌కు మరోసారి అధ్యక్ష పదవీ దక్కొచ్చని చర్చ జరుగుతోంది.
Similar News
News July 6, 2025
ప్రకాశం జిల్లా వాసులకు SP హెచ్చరిక

ప్రకాశం జిల్లా SP ఏ.ఆర్ దామోదర్ శనివారం పలు PSలలో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో కనిగిరి PSను సందర్శించి మాట్లాడారు. జిల్లాలో మొహర్రం వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేడుకల్లో ఎక్కడైనా శాంతి భద్రతలకు విగాథం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News July 6, 2025
ఏలూరు జిల్లాలో సోమవారం PGRS:కలెక్టర్

ఏలూరు జిల్లాలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాలలో PGRS జరుగుతుందన్నారు. ఆయా కారణాలతో ఆయా వేదికలకు రాలేని ప్రజలు https://meekosam. ap. gov. in తమ అర్జీలు వెబ్‌సైట్‌లో పొందుపర్చాలన్నారు. ఉదయం10 నుంచి కార్యక్రమం జరుగుతుందన్నారు.
News July 6, 2025
మహానందిలో క్షుద్ర పూజల కలకలం

మహానంది పుణ్యక్షేత్రం ఆవరణలోని గరుడ నంది పక్కన తాటి చెట్ల దగ్గర రెండు రోజుల క్రితం క్షుద్ర పూజలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో స్త్రీ బట్టలు, క్షుద్ర పూజా సామగ్రి ఉండటం చూసిన గ్రామస్థులు భయాందోళ చెందుతున్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.