News April 2, 2025
స్టేట్ టాప్‌గా కామారెడ్డి ఆర్టీఏ

రెవెన్యూ వసూళ్లలో కామారెడ్డి ఆర్టీఏ రాష్ట్రంలోనే టాప్‌లో నిలిచిందని డీటీఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేశారు. గతేడాది లక్ష్యం రూ.63 కోట్లు ఉండగా, ఈ సారి రూ.73 కోట్లకు రూ.68.19 కోట్లు (92.4%) వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో సిబ్బంది ప్రతి ఒక్కరి పాత్ర ఉందన్నారు.
Similar News
News January 1, 2026
తిరుమలలో టోకెన్లు లేకపోయినా రూములు

తిరుమలలో 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. గదుల కేటాయింపులో 7రోజుల పాటు స్వల్ప మార్పులు చేశారు. గతంలో ఎంబీసీ, టీబీసీ, పద్మావతి విచారణ కార్యాలయంలో టోకెన్లు కలిగిన భక్తులకు గదులు కేటాయిస్తున్నారు. తాజాగా సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా సీఆర్వో కార్యాలయం వద్ద గదులు కేటాయించనున్నారు.
Share It.
News January 1, 2026
చందన్వెల్లి చౌరస్తా.. ప్రపంచపు డిజిటల్ గల్లా పెట్టె!

వాట్సాప్ స్టేటస్ పెట్టినా, నెట్‌ఫ్లిక్స్‌లో మూవీ చూసినా ఆ డేటా వచ్చి చేరే ‘ప్రపంచపు డిజిటల్ లాకర్’ మన చేవెళ్లలో ఉంది. చందన్వెల్లి-షాబాద్ బెల్ట్ ఇప్పుడు అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలకు అడ్డా. గ్లోబల్ కంపెనీలు ₹లక్షల కోట్లు కుమ్మరిస్తున్నాయి. RRR కనెక్టివిటీ తోడైతే ఇండియాకే ‘డిజిటల్ పవర్ హౌస్’ కానుంది. పొలాలకు C/O అడ్రసైన ప్రాంతం, ఇప్పుడు ప్రపంచపు డేటాకు సెక్యూరిటీ గార్డ్‌లా మారుతోంది.
News January 1, 2026
అభయ వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ ప్రమాణస్వీకారం

ఖమ్మం నగరంలోని అభయ వెంకటేశ్వరస్వామి ఆలయ నూతన కమిటీ సభ్యులు గురువారం ఆలయ ప్రాంగణంలో ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ గౌరవ అధ్యక్షుడిగా బొల్లి కొమరయ్య, గౌరవ సలహాదారుగా పల్లెబోయిన చంద్రయ్య, దండా జ్యోతి రెడ్డి, అధ్యక్షుడిగా అల్లిక అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా బెల్లి కొండల్ రావు, కోశాధికారిగా పల్లపు సత్యంతో పాటు ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వరరావు, వీరబాబు, మణికంఠ, వెంకటేశ్వర్లు ప్రమాణం చేశారు.


