News September 16, 2024
స్టేట్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌గా ఏల్చూరు మహిళ
ఈ నెల 14, 15వ తేదీలలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన 11వ ఏపీ అన్ ఎక్యూపుడ్ పవర్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్ ఛాంపియన్ షిప్ పోటీలను నిర్వహించారు. ఈ పవర్ లిఫ్టింగ్ పోటీలలో సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన కుమారి నంద పాల్గొని 2 పతకాలు సాధించారు. ఈమెను పలువురు అభినందించారు.
Similar News
News October 7, 2024
మార్టూరులో విమానాశ్రయానికి ప్రతిపాదన: MLA ఏలూరి
మార్టూరులో విమానాశ్రయం, చినగంజాం మోటుపల్లిలో నౌకాశ్రయానికి ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టినట్లు పర్చూరు MLA ఏలూరు సాంబశివరావు తెలిపారు. విజన్ 2047రాష్ట్రా అభివృద్ధిలో భాగంగా.. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరగబోయే సమావేశంలో ఈ ప్రతిపాదనలు ఉంచనున్నట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా భవిష్యత్తులో పలు మౌలిక వసతుల కల్పనకు ఈ డాక్యుమెంటరీ ప్రతిపాదన చేసినట్లు తెలిపారు.
News October 7, 2024
చిన్నగంజాంలో బాలుడు దుర్మరణం
ఆటో గేర్ తగిలి ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెందిన ఘటన చిన్నగంజాంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. జీవన్(7) ఆగిఉన్న ఆటోను ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు హ్యాండిల్ గేర్లను తగలడంతో ఆటో ఒక్కసారిగా ముందుకు కదిలింది. వెంటనే బయపడిన బాలుడు ఆటోలో నుంచి కిందకు దూకే క్రమంలో పక్కనే ఉన్న గోడకు తల బలంగా తగలడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
News October 7, 2024
అద్దంకి: ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి
అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ప్రజా వేదికకు తరలివచ్చిన ప్రజలతో మంత్రి మమేకమై వారి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. సత్వరమే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.