News April 25, 2024

స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన నిర్మల్ జిల్లా విద్యార్థి

image

కుబీర్ మండలం సిరిపల్లి తండాకు చెందిన రాథోడ్ అంజలి నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది. నిర్మల్‌లోని టీఎస్ఆర్‌జేసీ‌లో ఇంటర్ చదువుతున్న అంజలి బైపీసీ గ్రూపులో 440 మార్కుల గాను 437 మార్కులు సాధించింది. దీంతో ఆమెను కుటుంబీకులు, గ్రామ సర్పంచ్ అశ్విని పండిత్ జాధవ్, గోపీచంద్ జాధవ్‌తో పాటు పలువురు అభినందించారు.

Similar News

News November 8, 2025

గిరిజన భాషల ఉత్సవాలకు ఉట్నూర్ వాసి

image

జాతీయస్థాయి గిరిజన భాషల ఉత్సవాలు ఈనెల 11, 12న న్యూఢిల్లీలో జరగనున్నాయి. నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఉట్నూర్‌కు చెందిన బంజారా రచయితా డా.ఇందల్ సింగ్‌ను ఆహ్వానించారు. జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమంలో గిరిజన భాషల ఔన్నత్యాన్ని తెలిపే అవకాశం లభించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ADB: శిక్షణ సివిల్ సర్వీస్ అధికారుల బృందానికి వీడ్కోలు

image

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్‌కు చెందిన శిక్షణ అధికారులు (ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఈఎస్, ఐఎస్ఎస్) బృందం జిల్లా పర్యటన ముగిసింది. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా తదితరులు పాల్గొన్నారు.