News April 25, 2024
స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన నిర్మల్ జిల్లా విద్యార్థి

కుబీర్ మండలం సిరిపల్లి తండాకు చెందిన రాథోడ్ అంజలి నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది. నిర్మల్‌లోని టీఎస్ఆర్‌జేసీలో ఇంటర్ చదువుతున్న అంజలి బైపీసీ గ్రూపులో 440 మార్కుల గాను 437 మార్కులు సాధించింది. దీంతో ఆమెను కుటుంబీకులు, గ్రామ సర్పంచ్ అశ్విని పండిత్ జాధవ్, గోపీచంద్ జాధవ్‌తో పాటు పలువురు అభినందించారు.
Similar News
News March 8, 2026
ADB: ట్రేడ్ టెస్ట్ పరీక్షలకు దరఖాస్తులు

ITI సంబంధిత ఏదైనా ట్రేడుల్లో అనుభవం ఉండి సర్టిఫికేట్ లేని ప్రైవేట్ అభ్యర్థుల నుంచి ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ITI ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ITI కోర్సులకు సంబంధించిన ట్రేడుల్లో కనీసం 3 సం.ల పని అనుభవం కలిగి, 21 వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 15 లోపు వరంగల్‌లోని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 8, 2026
ADB: బాధితుల ఇండ్ల వద్ద ఎఫ్ఐఆర్ నమోదు

ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలో బాధితుల ఇండ్ల వద్దకే శనివారం పోలీసులు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. డివిజన్ పరిధిలో 6 కేసులలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సులభంగా వేగంగా సేవలు అందించాలని లక్ష్యంతో బాధితుల ఇంటి వద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానాన్ని పోలీస్ శాఖ అమలులోకి తీసుకువచ్చిందని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఇది బాధితులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.