News July 15, 2024
స్టేట్ 29వ ర్యాంక్ సాధించిన కడప జిల్లా విద్యార్థిని

2023-2024 ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APRCET)లో కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం కొత్తూరుకు చెందిన మునగల కల్పన స్టేట్ 29వ ర్యాంక్ సాధించారు. కల్పన 112 మార్కులు సాధించి APRCETలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు ఆమెకు అభినందనలు తెలిపారు.
Similar News
News November 14, 2025
ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ GST రూ.15.25 లక్షలు మాయం..!

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ GSTకి సంబంధించిన భారీ నగదు లెక్కల్లో కనిపించడం లేదు. ఈ విషయాన్ని జీఎస్టీ అధికారులు గురువారం గుర్తించారు. 2021లో ఎగ్జిబిషన్కు సంబంధించి జీఎస్టీ రూ.15.25 లక్షలుగా నిర్ధారించారు. ఈ సొమ్మును చెల్లించామని మున్సిపల్ అధికారులు చెప్పగా.. ఆ డబ్బులు తమకు జమ కాలేదని GST అధికారులు అంటున్నారు. అసలు గుట్టు తేల్చడానికి జీఎస్టీ అధికారులు ఆడిట్కు సిద్ధమయ్యారు.
News November 13, 2025
కడప: ల్యాబ్లో సీతాకోకచిలుకల ఉత్పత్తి

కడప జిల్లాలోని వైవీయూ సరికొత్త ప్రయోగం చేపట్టింది. జంతుశాస్త్ర శాఖ ప్రయోగశాలలో క్యాపిటేటివ్ బ్రీడింగ్ ద్వారా సీతాకోక చిలుకలను ఉత్పత్తి చేసింది. వీటిని వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ గురువారం విడుదల చేశారు. ల్యాబ్ ద్వారా సీతాకోక చిలుకలను సృష్టించడం గొప్ప విషయమని కొనియాడారు. జువాలజి HOD డా.ఎస్పీ వెంకటరమణను పలువురు అభినందించారు. రిజిస్టర్ ప్రొ.పద్మ, డీన్ ప్రొ. ఏజీ దాము పాల్గొన్నారు.
News November 13, 2025
ప్రొద్దుటూరులో రేషన్ మాఫియా..!

ప్రొద్దుటూరులో రేషన్ మాఫియా విజృంభిస్తోంది. వాళ్ల దెబ్బకు అధికారులు సైతం హడలి పోతున్నారు. ఇటీవల రేషన్ బియ్యం తరలిస్తుండగా 1టౌన్, 3టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ప్రొద్దుటూరు మండలంలో 143 రేషన్ షాపులున్నాయి. వీటి పరిధిలో 68,675 రేషన్ కార్డులున్నాయి. నవంబర్ నెలకు 9,839 క్వింటాళ్ల బియ్యం, 648 క్వింటాళ్ల చక్కెర, 1,427 క్వింటాళ్ల జొన్నలు వచ్చాయి. వీటిలో ఎక్కువ భాగం పక్కదారి పట్టాయని సమాచారం.


