News February 4, 2025
స్టేషన్ ఘనపూర్: మంటల్లో కాలిన రూ.25 లక్షల నగదు!

స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో మల్లయ్య, కృష్ణమూర్తికి చెందిన రూ.25 లక్షల నగదుతో పాటు అప్పు పత్రాలు, బియ్యం బస్తాలు, ఐలయ్యకు చెందిన రూ.5 లక్షల విలువైన టెంటు సామగ్రి మంటల్లో కాలి బూడిద అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News September 13, 2025
మెదక్: తైబజార్ వసూళ్లు రద్దుకు ఆదేశం

మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మెదక్‌లో గిరిజన మహిళపై దురుసుగా ప్రవర్తించడం బాధాకరమని అన్నారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో తైబజార్ రద్దు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గిరిజన మహిళపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి పైన కేసు నమోదు చేయాలని డీఎస్పీకి సూచించారు.
News September 13, 2025
భద్రాచలం: గోదావరి పుష్కరాలు.. CM కీలక నిర్ణయం..!

2026లో జరగబోయే గోదావరి పుష్కరాలపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న పుణ్యక్షేత్రాల వద్ద టెంపుల్ సెంట్రిక్ ఘాట్‌లను నిర్మించాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. సుమారు రెండు లక్షల మంది భక్తులు ఒకేసారి స్నానాలు చేసేందుకు వీలుగా శాశ్వత ఘాట్‌లను నిర్మించాలన్నారు.
News September 13, 2025
నేడు విజయనగరం కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ

విజయనగరం జిల్లా కొత్త కలెక్టర్‌గా నియమితులైన ఎస్.రామసుందర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో అధికారికంగా బాధ్యతలు చేపడతారు. ఇప్పటివరకు ఆయన రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కమిషనర్‌గా, సీడీఏ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. పూర్వ కలెక్టర్ అంబేడ్కర్‌కు బదిలీ కాగా ఇంకా పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.