News February 4, 2025

స్టేషన్ ఘనపూర్: మంటల్లో కాలిన రూ.25 లక్షల నగదు!

image

స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో మల్లయ్య, కృష్ణమూర్తికి చెందిన రూ.25 లక్షల నగదుతో పాటు అప్పు పత్రాలు, బియ్యం బస్తాలు, ఐలయ్యకు చెందిన రూ.5 లక్షల విలువైన టెంటు సామగ్రి మంటల్లో కాలి బూడిద అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News February 13, 2025

‘భీముని కొలను’ గురించి తెలుసా?

image

పూర్వం పాండవులు శ్రీశైలం నల్లమల అడవుల్లో తీర్థయాత్రలు చేస్తుండగా ద్రౌపది దాహం తీర్చుకున్న కొలనే భీముని కొలనుగా ప్రసిద్ధి చెందింది. ద్రౌపది దాహంగా ఉందని చెప్పడంతో భీముడు చుట్టుపక్కల వెతికారని చరిత్ర చెబుతోంది. దాలోమశ మహర్షి ఒక శిలను చూపించి, పగులగొట్టమని చెప్పడంతో గదతో ఆ శిలను భీముడు పగులగొట్టగా నీటి ధారలు దూకాయట. భీముని కారణంగా ఏర్పడిన కొలను కావడంతో ‘భీముని కొలను‘ అనే పేరు వచ్చిందని అంటారు.

News February 13, 2025

మంగళగిరి: 35 మంది కార్యకర్తలకు ముందస్తు బెయిల్

image

2021లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పలు ప్రాంతాలకు చెందిన 35 మంది వైసీపీ కార్యకర్తలపై గుంటూరు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి వైవీఎస్బీజీ పార్థసారథి దాడి కేసులో 35 మంది వైసీపీ కార్యకర్తలకు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలో నిందితుల తరపున వైసీపీ లీగల్ సెల్ వాదించారు. 

News February 13, 2025

డోన్‌లో అద్భుత దృశ్యం

image

డోన్ పట్టణానికి సమీపంలో నూతనంగా నిర్మించిన షిర్డీ సాయిబాబా ఆలయంపై మాఘ పౌర్ణమి వేళ చంద్రుడు వెలిగిపోతూ దర్శనమిచ్చారు. నేడు సాయిబాబా ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ క్రమంలో మాఘ పౌర్ణమి వేళ చంద్రుడు ఆలయానికి వెలుగును ప్రసాదిస్తున్నట్లుగా అరుదైన దృశ్యం కనిపించింది. స్థానికులు ఆసక్తిగా తిలకించి తన ఫోన్లలో బంధించారు.

error: Content is protected !!