News February 4, 2025

స్టేషన్ ఘనపూర్: మంటల్లో కాలిన రూ.25 లక్షల నగదు!

image

స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో మల్లయ్య, కృష్ణమూర్తికి చెందిన రూ.25 లక్షల నగదుతో పాటు అప్పు పత్రాలు, బియ్యం బస్తాలు, ఐలయ్యకు చెందిన రూ.5 లక్షల విలువైన టెంటు సామగ్రి మంటల్లో కాలి బూడిద అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News March 8, 2026

KCR ఫొటో లేకుండానే రాజకీయాలు: కవిత

image

TG: మరో రెండుమూడు నెలల్లో పార్టీ పెట్టనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. BRSలోకి మళ్లీ వెళ్లేది లేదని స్పష్టం చేశారు. KCR ఫొటో లేకుండానే రాజకీయాలు చేస్తామని ఆమె ప్రకటించారు. తన వల్లే బీఆర్ఎస్ ఓడిందనే ఆరోపణలపైనా ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తాను జైలుకెళ్లాక పార్లమెంట్ ఎన్నికల్లో BRS ఓడిపోవడం నిజమైతే.. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడారని ప్రశ్నించారు.

News March 8, 2026

చిత్తూరులో భానుడి ప్రతాపం

image

సాధారణంగా వేసవి ప్రభావంతో ఏప్రిల్ నాటికి ఎండలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. జిల్లాలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రానున్న మూడు రోజులపాటు వేడిగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్న వార్తలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

News March 8, 2026

తూ.గో: కారులో ఫొటోలు.. SMలో వైరల్

image

ఓ యువతివి అసభ్యకర దృశ్యాలను చిత్రీకరించి SMలో పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్న వెబ్ సిరీస్ దర్శకుడిపై జూబ్లీహిల్స్ PSలో కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. కృష్ణనగర్‌లో ఉండే దర్శకుడు శంకర్(25) కాకినాడ నుంచి వచ్చిన యువతి(23)కి వెబ్ సిరీస్‌లో అవకాశం కల్పించాడు. కారులో కొన్ని అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు తీసి ఫేస్‌బుక్‌లో పెట్టి బ్లాక్ మెయిలింగ్‌కి పాల్పడ్డాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.