News February 4, 2025

స్టేషన్ ఘనపూర్: మంటల్లో కాలిన రూ.25 లక్షల నగదు!

image

స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో మల్లయ్య, కృష్ణమూర్తికి చెందిన రూ.25 లక్షల నగదుతో పాటు అప్పు పత్రాలు, బియ్యం బస్తాలు, ఐలయ్యకు చెందిన రూ.5 లక్షల విలువైన టెంటు సామగ్రి మంటల్లో కాలి బూడిద అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News February 14, 2025

రాంబిల్లి: బాలికపై లైంగిక దాడి

image

అనకాపల్లి జిల్లాలో ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. రాంబిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో మైనర్ బాలికను సేనాపతి నాగేంద్ర (20) అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఈనెల 10వ తేదీన జరగ్గా పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు గురువారం అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన నిందితుడిని కోర్టులో హాజరు పరిచినట్లు రాంబిల్లి సీఐ సీహెచ్ నర్సింగరావు తెలిపారు.

News February 14, 2025

తుని: దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్‌కి పితృవియోగం

image

ప్రముఖ సినీ దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్ తండ్రి ఏలేటి సుబ్బారావు (73) అనారోగ్యంతో మృతి చెందారు. కాకినాడ జిల్లా తుని మండలం రేఖవానిపాలెం గ్రామంలో గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. సంగీత దర్శకుడు, మృతుని బంధువులైన ఎంఎం కీరవాణి, రాజమౌళి సతీమణి తదితరులు గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

News February 14, 2025

రంగరాజన్‌పై దాడి.. తల్లాడకి చెందిన నలుగురి అరెస్ట్

image

హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనలో తల్లాడ మండలానికి చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంజనాపురానికి చెందిన భూక్యా శ్రీను, అంకోలు శీరిష, వెంకట్రామునితండాకు చెందిన భూక్యా గోపాల్ రావు, నారయ్యబంజరకు చెందిన బానోత్ బేబీరాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

error: Content is protected !!