News January 28, 2025
స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ కమిషనర్‌గా కృష్ణారెడ్డి

నూతనంగా మున్సిపాలిటీగా ఏర్పడిన స్టేషన్ ఘనపూర్‌కు గ్రేటర్ వరంగల్ డిప్యూటీ కమిషనర్ ఎన్.కృష్ణారెడ్డి ఫుల్ అడిషనల్ ఇన్‌ఛార్జి మున్సిపల్ కమిషనర్‌గా మంగళవారం బాధ్యతలు చేపట్టనున్నారు. వరంగల్ ఆర్డీఎంఏ షాహిద్ మసూద్ స్పెషల్ ఆఫీసర్‌గా నియమించబడ్డారు. దీంతో ఇప్పటివరకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన పాలన మంగళవారం నుంచి మున్సిపల్ అధికారులతో పాలన కొనసాగనుంది.
Similar News
News November 20, 2025
నెలాఖరులోగా ఎయిర్‌పోర్టు భూసేకరణ పూర్తి!

మామునూర్ ఎయిర్‌పోర్టు భూసేకరణ కొలిక్కి వస్తోంది. భూసేకరణలో 330 మంది భూమిని కోల్పోగా, వారిలో 180మంది రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.120 కోట్లు జమయ్యాయి. మరో 80 మందికి త్వరలోనే రూ.60 కోట్లు పడనున్నాయి. ఈ నెలాఖరు వరకు భూసేకరణ పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. 220 ఎకరాలను సేకరించగా, వాటిలో 20ఎకరాల బాధితులు కోర్టును ఆశ్రయించారు. 330 మందికి మొత్తం రూ.295కోట్లను ప్రభుత్వం పరిహారం అందించనుంది.
News November 20, 2025
542 ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)లో 542 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 24లోపు అప్లై చేసుకుని దరఖాస్తును స్పీడ్ పోస్టులో పంపాలి. వెహికల్ మెకానిక్, MSW పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. రాతపరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, PET, ట్రేడ్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bro.gov.in/
News November 20, 2025
ఎన్టీఆర్: పత్తి రైతులపై సీసీఐ నిర్లక్ష్యం

ఎన్టీఆర్ జిల్లాలో సీసీఐ ఆరు పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఏ కేంద్రంలోనూ కొనుగోలు జరగక రైతులు ఆందోళన చెందుతున్నారు. కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, ఏ.కొండూరు, గంపలగూడెంలో కేంద్రాలు ఉన్నప్పటికీ అధికారులు పత్తి తీసుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్దతు ధర క్వింటాకు రూ.7,710 – 8,110గా ఉన్నా దళారుల చేత తక్కువకు కొనిపించి లాభాలు పొందుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.


