News April 6, 2025
స్టేషన్ ఘనపూర్: విద్యుత్ షాక్‌తో బీపీఎం మృతి

స్టేషన్ ఘనపూర్ మండలం మీదికొండలో బీపీఎంగా పని చేస్తున్న బోడావుల నాగదుర్గ బాలాజీ (26) విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు సీఐ వేణు తెలిపారు. ఏపీలోని ఏలూరు జిల్లా కైకలూరు మండలం నర్సాయపాలెం గ్రామానికి చెందిన బాలాజీ 15 నెలల క్రితం మీదికొండలో పోస్టుమాస్టర్‌గా విధుల్లో చేరాడు. స్టేషన్ ఘనపూర్‌లో నివాసం ఉంటున్న ఆయన నీళ్ల కోసం మోటార్ ఆన్ చేయగా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు సీఐ చెప్పారు.
Similar News
News April 17, 2025
WGL: మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా ధర రూ.6,200, పచ్చి పల్లికాయ రూ.4,500 పలికింది. అలాగే పసుపు(కాడి) క్వింటాకి ధర రూ.14,117 వచ్చింది. మరోవైపు మక్కలు(బిల్టీ) క్వింటా ధర రూ.2,365 పలికినట్లు అధికారులు వెల్లడించారు.
News April 17, 2025
రేపు తిరుపతికి పవన్ కళ్యాణ్ రాక.?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం తిరుపతికి రానున్నట్లు సమాచారం. టీటీడీ గోశాలపై మాజీ ఎమ్మెల్యే భూమన ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. గోవులను పవన్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తారు.
News April 17, 2025
భూపాలపల్లిలో సైబర్ నేరాలపై ఎస్పీ హెచ్చరిక

భూపాలపల్లి జిల్లాలో సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రభుత్వ ఏజెన్సీల పేరిట ప్రజలను భయపెడుతున్నారని ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు. లాటరీలు, రివార్డులు, డిస్కౌంట్ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించే ఆశ చూపి మోసం చేస్తున్నారని తెలిపారు. OTP ఎవరితోనూ పంచుకోవద్దని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.