News March 12, 2025
స్టేషన్ ఘనపూర్: సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి చేయాలి: అడిషనల్ కలెక్టర్

ఈనెల 16న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు రెండు రోజుల ముందే ఏర్పాటు పూర్తి చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆర్డీవో డీఎస్ వెంకన్నతో కలిసి బహిరంగ సభ స్థలాన్ని, హెలిపాడ్ స్థలాన్ని, పార్కింగ్ స్థలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News November 27, 2025
ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ చేయించాలి: కలెక్టర్

జిల్లాలో 0- 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు ఆధార్ నమోదు చేయించాలని కలెక్టర్ జితేష్ వీ పాటిల్ సూచించారు. కలెక్టరేట్లో బుధవారం అన్ని శాఖల అధికారులతో ఆయన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఆధార్ నమోదు కేంద్రాలు పని చేయాలని, 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు దాటిన వారు ఆధార్ బయోమెట్రిక్ చేయించుకోవాలని కోరారు.
News November 27, 2025
రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్‌పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
News November 27, 2025
HNK టౌన్‌హాల్‌కి శతాబ్దం.. శతవత్సరాల చారిత్రక సాక్ష్యం

వరంగల్ నగరంలో నిలిచిన హనుమకొండ టౌన్‌హాల్‌కు శతవత్సరం పూర్తైంది. 1924లో పునాదిరాయి వేసి ఏడో నిజాం చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కట్టడం నేటికీ చారిత్రక ప్రతీకగా నిలుస్తోంది. ‘మహబూబ్ బాగ్’ పేరుతో 7 ఎకరాల్లో నిర్మించిన ఈ గార్డెన్‌కి అప్పట్లో రూ.2 లక్షలు మంజూరు చేశారు. ఒకప్పుడు చిన్న జూపార్క్‌గా ఉన్న ఇక్కడ.. నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంతో సాంస్కృతిక కేంద్రంగా కొనసాగుతోంది.


