News March 15, 2025

స్టేషన్ ఘనపూర్: సీఎం సభ స్థలాలను పర్యవేక్షించిన కలెక్టర్

image

ఈనెల 16న ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం శివునిపల్లి శివారులో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యవేక్షించారు. ముందుగా హెలీ ప్యాడ్, సభా స్థలికి సంబంధించిన, ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Similar News

News March 15, 2025

వరంగల్: బ్యాంక్ సిబ్బంది వేధింపులు.. సోదరుల ఆత్మహత్యాయత్నం

image

వరంగల్ పట్టణ పరిధిలో దారుణం జరిగింది. ప్రైవేట్ బ్యాంక్ సిబ్బంది వేధింపులు తట్టుకోలేక పట్టణంలోని చిలుకూరి క్లాత్ స్టోర్ సోదరులు ఇద్దరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 15, 2025

ఎస్ఎస్సీలో 100% ఫలితాలు సాధించాలి: ఖుష్బూ గుప్తా

image

వచ్చే 10వ తరగతి పరీక్షల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థులు 100% పాస్ అయ్యేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా సూచించారు. శనివారం ఉట్నూర్ పీఎంఆర్సీ సమావేశం మందిరంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులు పరీక్షలు సాఫీగా రాసేలా చూడాలన్నారు. రాబోయే 20 రోజులు ఉపాధ్యాయులకు సెలవు ఉందడన్నారు.

News March 15, 2025

వాళ్లే జనసేన MLAలు: అంబటి రాంబాబు

image

AP: తన సిద్ధాంతం ఏంటో తెలియని స్థితిలో Dy.CM పవన్ ఉన్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ‘పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్‌రేట్ అని మాట్లాడుతున్నారు. గెలిచిన వారిలో అసలైన జనసేన నేతలు ఎంతమంది? YCP టికెట్ రాని, చంద్రబాబు మనుషులే జనసేన MLAలు. 2 పార్టీలు వాపును చూసి బలం అనుకుంటున్నాయి. జనసేన MLAలు దోపిడీ చేస్తుంటే పవన్ చుక్కలు లెక్కబెడుతున్నారు’ అని విమర్శించారు.

error: Content is protected !!