News March 15, 2025
స్టేషన్ ఘనపూర్: సీఎం సభ స్థలాలను పర్యవేక్షించిన కలెక్టర్

ఈనెల 16న ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం శివునిపల్లి శివారులో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యవేక్షించారు. ముందుగా హెలీ ప్యాడ్, సభా స్థలికి సంబంధించిన, ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Similar News
News March 8, 2026
నల్గొండ: గ్యాస్ సెగ.. సామాన్యుడిపై రూ.70 కోట్ల అదనపు భారం

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి సామాన్యుడి వంటింట్లో మంటలు రేపింది. డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 చొప్పున పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజా పెంపుతో ఉమ్మడి జిల్లాలోని వినియోగదారులపై ఏడాదికి సుమారు రూ.70 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ధరల పెరుగుదలపై జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News March 8, 2026
నల్గొండ: దేశంలోనే అరుదైన దేవాలయం మన దగ్గరే..

నల్గొండ జిల్లా అడవిదేవులపల్లిలో కృష్ణానది ఒడ్డున విశిష్టమైన సూర్య దేవాలయం కొలువై ఉంది. దేశంలోనే పడమర దిక్కున ఉన్న ఏకైక సూర్య దేవాలయంగా ఈ ఆలయం గుర్తింపు పొందింది. ఇక్కడ సూర్యాస్తమయ సమయంలో కిరణాలు నేరుగా స్వామివారి పాదాలను తాకడం విశేషం. విశ్వామిత్ర మహర్షి సర్పయాగం చేసిన ఈ ప్రాంతంలో, కాకాసురుని వధ జరిగినందున కాకులు కనిపించవని భక్తుల నమ్మకం. ఈ గుడిని 800 ఏళ్ల క్రితం కల్యాణ చాళుక్యులు నిర్మించారు.
News March 8, 2026
మహబూబాబాద్: మహిళలపై పెరుగుతున్న దాడులు

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏడాది కాలంగా మహిళలపై అనేక దాడులు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 176 వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి. 42 ఈవ్ టీజింగ్ కేసులు, 55 అత్యాచారం కేసులు, 5 వరకట్న హత్యల కేసులు, 9 మహిళల హత్యల కేసులు, 178 అత్యాచారయత్నం కేసులు నమోదయ్యాయి. మహిళలపై వేదింపుల కేసులను షీ టీం పోలీస్ స్టేషన్లు పరిష్కారించనుంది.


