News June 18, 2024

స్టేషన్ ఘనపూర్: GREAT.. చదువుకున్న స్కూల్‌కే HMగా!

image

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం చిన్నపెండ్యాలకు చెందిన శాగ శ్రీనివాస్ అప్పటి మల్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1989-90లో పదో తరగతి చదువుకున్నారు. ఆయన ఇటీవల మల్కాపూర్ పాఠశాలకు గెజిటెడ్ హెచ్ఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులైన ఇల్లందుల సుదర్శన్, జనగాం యాదగిరి మాట్లాడుతూ.. చదువుకున్న పాఠశాలకు హెచ్ఎంగా ఉద్యోగం రావడం అభినందనీయమన్నారు.

Similar News

News January 17, 2026

వరంగల్: గ్రూప్-3లో ఎంపికైన అభ్యర్థికి నియామక ఉత్తర్వులు: వీసీ

image

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్-3 ఉద్యోగ నియామక పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థికి వరంగల్ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఉద్యోగ నియామకం చేస్తూ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ రమేశ్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు అందజేశారు. ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ మల్లేశ్వర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

News January 13, 2026

వరంగల్: రాజకీయ నాయకుల్లో సంక్రాంతి సంబరం..!

image

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ముందే సంక్రాంతి పండుగ రావడంతో నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో రాజకీయ వేడి పెరిగింది. నేతలు ఓటర్ల తుది జాబితా పూర్తవడంతో రిజర్వేషన్లపై లెక్కలు వేసుకుంటూ తమ వైపు ప్రజలను తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పండగకు ఊరికి వచ్చిన వారిని ఆత్మీయంగా పలకరిస్తూ, మూడు రోజుల పాటు మద్దతు కూడగట్టే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. అన్ని పార్టీల్లోనూ ఇదే ఉత్సాహం కనిపిస్తోంది.

News January 12, 2026

ప్రజావాణిలో 129 వినతులు స్వీకరణ: వరంగల్ కలెక్టర్

image

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌వో విజయలక్ష్మి, ఆర్డీవోలు సుమ, ఉమారాణి పాల్గొన్నారు. మొత్తం 129 దరఖాస్తులు అందగా వాటిలో రెవెన్యూ సంబంధిత 52 ఉన్నాయి. భూ సమస్యలు, పింఛన్లు, గృహాలు, సంక్షేమ పథకాలపై వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.