News January 30, 2025
స్టేషన్ ఘన్‌పూర్‌లో న్యాయస్థానం ఏర్పాటు

జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో ఫిబ్రవరి 1న న్యాయస్థానం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా జడ్జి డి.రవీంద్ర శర్మ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్ట్ జడ్జి సూరేపల్లి నంద హాజరై ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారుమూల ప్రజలకు సత్వరమే న్యాయ సేవలు అందించేందుకు ఈ న్యాయస్థానం ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు.
Similar News
News November 14, 2025
అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

➤ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు
➤ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు పోటీలు
➤ అనకాపల్లిలో బీజేపీ విజయోత్సవ సంబరాలు
➤ డ్రగ్స్‌కి వ్యతిరేకంగా నర్సీపట్నంలో పోలీసుల సైకిల్ ర్యాలీ
➤ వాట్సాప్ గవర్నెన్స్‌పై అవగాహన కార్యక్రమాలు
➤ రాజయ్యపేటలో మెడకు ఉరితాళ్లు వేసుకొని నిరసన
➤ మాడుగుల అభివృద్ధి బ్రోచర్‌ను మంత్రి లోకేశ్‌కు అందజేసిన ఎమ్మెల్యే
News November 14, 2025
హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల వన్ టైం చాన్స్ పరీక్షా తేదీల ఖరారు

ఓయూ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) వన్ టైం చాన్స్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సుల అన్ని సెమిస్టర్ల వన్ టైం చాన్స్ బ్యాక్ లాగ్ పరీక్షలను ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబసైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
News November 14, 2025
ఈ నెల 19న రైతుల ఖాతాల్లో PM కిసాన్ డబ్బులు

PM కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న PM మోదీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా అన్నదాతల అకౌంట్లలో జమ చేశారు. పీఎం కిసాన్ <


