News January 24, 2025
స్టే.ఘనపూర్: ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ఫోన్.. చివరికి!

ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకున్న చోట కాకుండా.. మరో గ్రామంలో ఇల్లు వచ్చిందంటూ అధికారులు ఫోన్ చేయడం లబ్ధిదారుడిని అయోమయంలో పడేసింది. స్టే.ఘనపూర్‌కు చెందిన దేవరాయి కుమారస్వామి తన భార్య పేరుతో ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకున్నాడు. కాగా గురువారం స్టే.ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో తనకు ఇల్లు మంజూరైనట్టు అధికారులు ఫోన్ చేశారు. ఇది ఎలా అని అడిగితే మిస్టేకంటూ పేరు కొట్టివేశారని బాధితుడు చెప్పారు.
Similar News
News April 12, 2026
NTR: ఎం.ఫార్మసీ విద్యార్థులకు ముఖ్య గమనిక

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో FEB 2026లో నిర్వహించిన ఎం.ఫార్మసీ 1వ సెమిస్టర్ పరీక్షల (2025-26 విద్యా సంవత్సరం) రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 20వ తేదీలోపు ఒక్కో పేపరుకు రూ. 1,100 ఫీజు http://www.onlinesbi.com/ వెబ్‌సైట్‌లో చెల్లించాల్సి ఉంటుందని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.
News April 12, 2026
చేపను ఇవ్వడం కాదు పట్టడం నేర్పాలి.. ఏమంటారు?

దేశంలో ఉచిత పథకాల వల్ల ప్రజలు బద్ధకస్థులు అవుతున్నారని, వాటిని రద్దు చేయాలని కొంతమంది ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం అదే మాట చెప్పారు. ‘ప్రభుత్వం ఉచితాలు రద్దు చేసి విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలి. పార్టీలు ఇలాంటి వాగ్దానాలు చేసినప్పుడు వాటి బడ్జెట్ ఎంత? ఎలా నిధులు సమకూరుస్తారు? అని ప్రజలు అడగాలి’ అని ఓ కార్యక్రమంలో అన్నారు.
News April 12, 2026
కర్నూలు: యవకుడు, మహిళ సూసైడ్

కర్నూలు(D) దేవనకొండ మండలానికి చెందిన మహిళ, యువకుడు శనివారం సూసైడ్ చేసుకున్నారు. అలారుదిన్నెకు చెందిన రంగస్వామి(21), ఉరుకుందకు చెందిన ప్రమీల(23) దంపతులమని చెప్పి 2 నెలల క్రితం కడప(D) ప్రొద్దుటూరు(M) లింగాపురంలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. రంగస్వామి చదువుతుండగా, ప్రమీలకు ఇదివరకే వేరే వ్యక్తితో వివాహమైంది. భర్తకు దూరంగా ఉంటూ పిల్లలతో కలిసి రంగస్వామితో నివసిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ ఉరేసుకున్నారు.


