News January 28, 2025
స్టే.ఘ: విలేజ్ ఇన్నోవేషన్ అవార్డు అందుకున్న బూర్ల కళ్యాణ్

స్టేషన్ ఘనపూర్ మండలంలోని చాగల్లు గ్రామానికి చెందిన బూర్ల కళ్యాణ్ ఇన్నోవేషన్ అవార్డును అందుకున్నారు. ‘కాలేజ్ కనెక్ట్’ పేరుతో రూపొందించిన డిజిటల్ ప్లాట్ ఫామ్ విద్యార్థులకు, విద్యకు సంబంధించిన అన్ని అవసరాలు తీర్చేలా ప్రత్యేకంగా రూపొందించాడు. దీంతో పుస్తకాలు కొనుగోలు చేయడం, విక్రయించడం, మెంటర్ సాయంపొందడం, స్టడీ గ్రూప్‌తో అభ్యాసం చేయడం అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయని కళ్యాణ్ తెలిపాడు.
Similar News
News July 5, 2025
54 ఏళ్ల తర్వాత..

భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డుల మోత మోగిస్తున్నారు. 54 ఏళ్ల తర్వాత ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన భారత ప్లేయర్‌గా నిలిచారు. 1971లో వెస్టిండీస్‌పై సునీల్ గవాస్కర్ ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా గిల్ తొమ్మిదో ప్లేయర్ కావడం గమనార్హం. అటు ఒకే టెస్టులో రెండు శతకాలు చేసిన 3వ భారత కెప్టెన్ అతడు. ఇక WTCలో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రోహిత్(9) తర్వాతి స్థానంలో గిల్(8) ఉన్నారు.
News July 5, 2025
ఏలూరు: SDG లక్ష్యాలను సాధిస్తాం

ఉభయగోదావరి జిల్లాలోని పంచాయతీ అధికారులకు పంచాయతీ పురోగతి సూచికపై శనివారం ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. జిల్లా ప్రజా పరిషత్ కార్యనిర్వాహణాధికారి శ్రీహరి మాట్లాడారు. SDG కి సంబంధించిన 227 డేటా పాయింట్స్ ని PAI వెబ్ సైట్‌లో పొందుపరచడంపై శిక్షణ ఇవ్వడం జరిగినదని తెలిపారు. 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధిస్తామన్నారు.
News July 5, 2025
NRPT: అథ్లెటిక్స్ ఆడెందుకు బయలుదేరిన క్రీడాకారులు

తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఆడిందుకు నారాయణపేట జిల్లా క్రీడాకారులు శనివారం బయలుదేరారు. హనుమకొండలో రేపటి నుంచి ప్రారంభమయ్యే “Trithalon అథ్లెటిక్స్” అండర్-10, 12, 14 విభాగంలో 60 మీ. రన్నింగ్, లాంగ్ జంప్, జావిలిన్ త్రో తదితర క్రీడల్లో 20 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. మండల విద్యాధికారి కృష్ణారెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ రమణ బెస్ట్ విషెస్ తెలిపారు.