News May 22, 2024
స్ట్రాంగ్ రూమును పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో ఈవీఎం మిషన్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా కలెక్టర్ సృజన, ఎస్పీ కృష్ణ కాంత్ మంగళవారం పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన కంట్రోల్ రూమ్ నుంచి లైవ్ ఫీడ్ వారు పరిశీలించారు. రాయలసీమ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్, లైబ్రరీ సైన్స్ బ్లాక్ పరిసరాలను వారు పరిశీలించారు. పాణ్యం ఆర్ఓ నారపు రెడ్డి మౌర్య, కర్నూలు ఆర్వో భార్గవ తేజ్ పాల్గొన్నారు.
Similar News
News November 3, 2025
భక్తులు అప్రమత్తంగా ఉండాలి: కర్నూలు ఎస్పీ

కార్తీకమాసం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలు, నదీతీరాలకు తరలి వస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి అని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. మహిళలు దీపాలు వెలిగించి వాటిని నదుల్లో వదిలే సమయంలో, స్నానాల సమయంలో జాగ్రత్తలు పాటించాలని, చిన్న పిల్లలతో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓర్వకల్ శ్రీ కాల్వబుగ్గ, రామేశ్వర, బ్రహ్మగుండేశ్వర, నందవరం దేవాలయంలో భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
News November 2, 2025
తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి యువకుడి మృతి.!

మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామంలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వీరేంద్ర తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. స్నానానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నది ఉద్ధృతికి కొట్టుకుపోయి మరణించాడని స్థానికులు తెలిపారు. కొడుకును కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గ్రామస్థులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
News November 1, 2025
స్పెషల్ ఆఫీసర్లు మండలాలకు వెళ్లాలి: కర్నూలు కలెక్టర్

కర్నూలు జిల్లాలో నియోజకవర్గ, మండల స్పెషల్ ఆఫీసర్లు ప్రతి వారం తప్పనిసరిగా మండలాలకు వెళ్లి ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్లు, సచివాలయాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో ఆమె మాట్లాడుతూ.. బీసీ హాస్టళ్లలో పదో తరగతి ఉత్తీర్ణతా శాతం పెంచాలన్నారు. హాస్టళ్లలో తాగునీరు, భోజనం, టాయిలెట్లపై చర్యలు చేపట్టాలని సూచించారు.


