News March 21, 2024
స్ట్రాంగ్ రూములు పటిష్టంగా ఏర్పాటు చేయండి :కలెక్టర్

ఎన్నికల కోసం రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూములను పటిష్టంగా ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి స్ట్రాంగ్ రూములు ,కౌంటింగ్ హాళ్ల ఏర్పాటును పరిశీలించారు. రాయలసీమ యూనివర్సిటీలో 8 నియోజకవర్గాల స్ట్రాంగ్ రూములు ,కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు.
Similar News
News November 17, 2025
కర్నూలు: రౌడీ షీటర్లకు ఎస్పీ కౌన్సెలింగ్

సత్ప్రవర్తనతో జీవించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. నేర నియంత్రణలో భాగంగా జిల్లావ్యాప్తంగా రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు పోలీసులు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. నేరాల్లో మళ్లీ పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
News November 17, 2025
నేడు కర్నూలులో PGRS

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని ఈ నెల 17న (సోమవారం) నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ. సిరి తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణంలోని సునయన ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరగనుంది. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, మున్సిపల్, డివిజన్ స్థాయిలోనూ ఈ వేదిక జరుగుతుందని, ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
News November 16, 2025
ఆదోని జిల్లా సాధించి తీరుతా: ఎమ్మెల్యే పార్థసారథి

ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదివారం పట్టణంలో చేపట్టిన నిరాహార దీక్షలో ఎమ్మెల్యే పార్థసారథి, కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే జిల్లా ఏర్పాటుతోనే సాధ్యమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి, ఆదోని జిల్లాను సాధించి తీరుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే హామీపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.


