News May 27, 2024

స్ట్రాంగ్ రూములు పరిశీలించిన నంద్యాల కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆర్జీఎం, శాంతిరాం ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు ఆదివారం పరిశీలించారు. ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి భ‌ద్ర‌తాప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను ప‌రిశీలించారు. సీసీ కెమెరాల ప‌నితీరు, మానిట‌రింగ్ రూమ్ ద్వారా ప‌ర్య‌వేక్ష‌ణ గురించి అక్క‌డ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

Similar News

News October 10, 2024

నంద్యాల: కొబ్బరి బొండంపై నవదుర్గల చిత్రాలు

image

ఆళ్లగడ్డకు చెందిన ఆర్టిస్టు విజయ్ అద్భుతమైన చిత్రాన్ని రూపొందించారు. దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా కొబ్బరి బొండంపై నవదుర్గ మాతల చిత్రాలను అక్రిలిక్ రంగులతో తీర్చిదిద్దారు. ఆది పరాశక్తి జగజ్జనని 9 రూపాలైన శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహా గౌరి, సిద్ధిధాత్రి అమ్మవార్ల చిత్రాలను చిత్రీకరించారు.

News October 10, 2024

నంద్యాల చిత్రకారుడి ప్రతిభ.. చిటికెన వేలుపై సాయిబాబా ప్రతిరూపం

image

నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ మరోసారి తన టాలెంట్ చూపెట్టారు. చిటికెన వేలుపై సాయిబాబా ప్రతిరూపాన్ని చిత్రీకరించి అబ్బురపరిచారు. బాబాపై ఉన్న భక్తి, ప్రేమతో ఈ చిత్రాన్ని వేసినట్లు ఆయన తెలిపారు. ‘సబ్ కా మాలిక్ ఏక్ హై’ అన్న నినాదం ఈ చిత్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుందని, ప్రస్తుత సమాజానికి బాబా బోధనలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

News October 10, 2024

100 రోజుల ప్రణాళికలను సాధించాలి: కలెక్టర్

image

డిసెంబర్ 31వ తేది లోపు రెండో దశ 100 రోజుల ప్రణాళిక లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 100 రోజులు లక్ష్యాల (ఫేజ్-II)పై జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖలకు సంబంధించిన రెండో దశ 100 రోజుల లక్ష్యాల సాధనపై సమీక్షించారు. లక్ష్య సాధనలో వెనకబడకూడదని ఆదేశించారు.