News May 27, 2024
స్ట్రాంగ్ రూములు పరిశీలించిన నంద్యాల కలెక్టర్

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆర్జీఎం, శాంతిరాం ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు ఆదివారం పరిశీలించారు. ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి భద్రతాపరమైన చర్యలను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, మానిటరింగ్ రూమ్ ద్వారా పర్యవేక్షణ గురించి అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
Similar News
News February 9, 2025
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

కర్నూలులోని సంకల్పాగ్ వద్ద ఉన్న హరిహర క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. గత నెల 30న ధ్వజావరోహణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు పది రోజులపాటు వైభవంగా నిర్వహించారు. పవిత్ర తుంగభద్ర నదిలో మీద పండితులు స్వామి వారికి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు. చక్రస్నానం సందర్భంగా గరుడ పక్షి మాడవీధుల్లో ప్రదక్షణ చేసింది.
News February 7, 2025
మీ పిల్లల టాలెంట్‌ని అందరికీ చెప్పాలనుకుంటున్నారా

డ్యాన్స్, సింగింగ్, డ్రాయింగ్, స్పీచ్ ఇలా ఏదైనా మీ పిల్లల్లో ప్రతిభ ఉంటే 5 నిమిషాలు మించకుండా వీడియో తీసి తప్పకుండా ఎడిట్ చేయండి. పిల్లల పేరు, తరగతి, గ్రామం వివరాలతో.. 97036 22022 నంబరుకు వాట్సప్ చేయండి. Way2News ఎంపిక చేసిన ఉత్తమ వీడియోను ప్రతి ఆదివారం సా.6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
➤ ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో వచ్చిన వీడియోలనే పరిగణిస్తాం.
➤ 15 ఏళ్ల లోపు పిల్లల వీడియోలే తీసుకుంటాం.
News February 6, 2025
ఓర్వకల్లు దగ్గర ప్రమాదం.. ఇద్దరు మృతి

కర్నూలు జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓర్వకల్లు వద్ద ట్రాక్టర్, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మృతులు జానకి(60), విహారిక(4)గా గుర్తించారు. తిరుమల దర్శనం చేసుకుని తిరిగి రాయచూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.