News February 28, 2025

స్ట్రాంగ్ రూమ్‌కు చేరిన బ్యాలెట్ బాక్సులు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూముకు చేరుకున్నాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరిగింది. పోలింగ్ పూర్తయిన అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్స్‌లను భారీ భద్రత మధ్య తీసుకుని వచ్చి జిల్లా కేంద్రంలో ఉన్న స్ట్రాంగ్ రూముకు చేర్చారు.

Similar News

News November 9, 2025

రాష్ట్రస్థాయి పోటీలో ఫైనల్‌కు ADB జట్టు

image

నారాయణపేటలో జరుగుతున్న ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ అండర్-17 బాలికల విభాగంలో ఆదిలాబాద్ జిల్లా జట్టు ఫైనల్‌కు చేరింది. సెమి ఫైనల్ మ్యాచ్‌లో కరీంనగర్ జట్టుపై ఆదిలాబాద్ జట్టు విజయం సాధించింది. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌లలో జిల్లా జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. ఘన విజయాలను నమోదు చేసినట్లు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ రామేశ్వర్ తెలిపారు. జిల్లా జట్టుకు DEO రాజేశ్వర్ అభినందనలు తెలిపారు.

News November 9, 2025

వికారాబాద్ బీజేపీ అధ్యక్ష పదవి జాప్యంపై ఉత్కంఠ

image

డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండడంపై పార్టీలో చర్చ నడుస్తోంది. ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినా, అధిష్ఠానం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ జాప్యానికి కారణం ఏంటన్న దానిపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మద్దతు ఎవరికి ఉంటుందనే అంశంపై జిల్లా రాజకీయాల్లో భారీగా ఉత్కంఠ నెలకొంది.

News November 9, 2025

అన్నమయ్య: నూతన కమిటీ నియామకం

image

అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అన్నమయ్య జిల్లా నూతన కమిటీని ఎంపిక చేశారు. అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్.శ్రీలక్ష్మి, పి.రాజేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా యం.గౌరి నియమితులయ్యారు. ఆ సంఘం 2వ జిల్లా మహాసభ మదనపల్లె ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగింది. 13 మంది ఆఫీస్ బేరర్లు, 33మందితో జిల్లా కమిటీ ఏర్పరిచారు.