News February 28, 2025
స్ట్రాంగ్ రూమ్‌కు చేరిన బ్యాలెట్ బాక్సులు

పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూముకు చేరుకున్నాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరిగింది. పోలింగ్ పూర్తయిన అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్స్‌లను భారీ భద్రత మధ్య తీసుకుని వచ్చి జిల్లా కేంద్రంలో ఉన్న స్ట్రాంగ్ రూముకు చేర్చారు.
Similar News
News March 26, 2025
ప్రకాశం: వైసీపీకి మరో షాక్ తప్పదా..?

ప్రకాశం జిల్లాలో YCPకి షాక్ ఇచ్చేందుకు TDP పావులు కదుపుతోంది. మార్కాపురం, త్రిపురాంతకం MPP ఎన్నిక గురువారం జరగనుంది. పుల్లలచెరువులో వైస్ MPP, ఎర్రగొండపాలెంలో కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక సైతం నిర్వహిస్తారు. అన్ని చోట్లా YCPకి పూర్తి మెజార్టీ ఉన్నా ఆయా స్థానాలను దక్కించుకోవడానికి TDP గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కొందరు స్వచ్ఛందంగా టీడీపీ గూటికి చేరగా.. మరికొందరిని కొన్ని హామీలతో తమవైపు తిప్పుకుంటోంది.
News March 26, 2025
శ్రీశైలానికి కన్నడిగుల సాహస యాత్ర

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది కన్నడిగులు పాదయాత్రతో శ్రీశైలం చేరుకుంటున్నారు. వందల కిలోమీటర్ల నుంచి వస్తూ ఆత్మకూరు సమీపంలో కాళ్లకు కర్రలు కట్టుకొని దట్టమైన నల్లమల అడవులలో సాహస యాత్రను చేపడుతున్నారు. వారి పాదయాత్రను చూసి స్థానిక ప్రజలు కన్నడిగుల భక్తికి ఇదే నిదర్శనమని పేర్కొంటున్నారు. కాగా ఈ నెల 31 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి.