News March 26, 2025
స్త్రీ నిధి రుణాలు వసూలు చేయాలి: ASF అదనపు కలెక్టర్

జిల్లాలో స్త్రీ నిధి రుణాల వసూలుపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో సహాయ ప్రాజెక్టు మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్త్రీ నిధి రుణాల వసూలు సమర్థవంతంగా నిర్వహించాలని, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సాధికారత కల్పించే లక్ష్యంతో అందించిన రుణాలను సకాలంలో తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News November 19, 2025
ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశాలు: డీఈఓ సత్యనారాయణ

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ నెలలో కాంప్లెక్స్ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు డీఈఓ సత్యనారాయణ తెలిపారు. నవంబర్ 21, 22న ప్రాథమిక పాఠశాల, 24, 25న ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఈ సమావేశాల్లో పాల్గొనాలని ఆయన ఆదేశించారు. ఉపాధ్యాయులు రెండు రోజులు విడివిడిగా తప్పనిసరిగా హాజరు కావాలని డీఈఓ స్పష్టం చేశారు.
News November 19, 2025
కుండలేశ్వర పుణ్యక్షేత్రంలో విషాదం

కాట్రేనికోన మండలం కుండలేశ్వరం శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి ఆలయం వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి దర్శనానికి వచ్చిన బొట్టా నిర్మల (67) గుండెపోటుతో మృతిచెందారు. భక్తురాలు నిర్మల స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయం బయట కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా ఆకస్మికంగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
News November 19, 2025
మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు: కలెక్టర్

జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదవుతున్న కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదకద్రవ్యాల వాడకం నియంత్రణ, శాఖలవారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజల్లో అవగాహన పెంపు వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.


