News July 25, 2024

స్థలం కేటాయించాకే రైల్వే జోన్ పనులు: కేంద్రమంత్రి

image

విశాఖలో జీవీఎంసీ అధికారులు తగిన స్థలం కేటాయించిన తరువాతే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు ప్రారంభం అవుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్పష్టం చేశారు. 2024-25 రైల్వే బడ్జెట్‌కు సంబంధించి ఆయన మాట్లాడుతూ.. విశాఖ జిల్లా అధికారుల వల్లే జోన్ పనులు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. ఈ బడ్జెట్‌లో తూర్పు కోస్తా రైల్వే జోన్ ఉన్న ఒడిశా రాష్ట్రానికి రూ.10,586 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

Similar News

News October 18, 2025

గాజువాక: టిప్పర్ బీభత్సం.. మహిళ మృతి

image

గాజువాక సమతా నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. శనివారం ఉదయం భారీ టిప్పర్ రోడ్డు పక్కన కొబ్బరిబోండాలు అమ్ముతున్న వియ్యపు అప్పయ్యమ్మపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. చిన్న బాలుడికి గాయాలు అయ్యాయి. న్యూ‌పోర్ట్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. నిద్రమత్తులో వాహనం నడపడం వలనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

News October 17, 2025

విశాఖ డీఆర్వో Vs ఆర్డీవో

image

విశాఖ‌ DRO భవానీ శంకర్‌, RDO శ్రీలేఖ మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. డీఆర్వోపై కలెక్టర్‌కు ఆర్డీవో ఇటీవల లేఖ రాయగా.. రెవెన్యూ సిబ్బంది క‌లెక్ట‌ర్‌ను శుక్ర‌వారం క‌లిసి విన‌తిప‌త్రం అందించిన‌ట్లు స‌మాచారం. పచారీ సరుకుల కోసం త‌హశీల్దార్ల‌కు ఇండెంట్లు పెడుతున్నారన్న RDOఆరోపణలపై ‘అవగాహన లేని అధికారి చేసిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని’ DRO అన్నారు. కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

News October 17, 2025

విశాఖ: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

image

ఆరిలోవ BRTS రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. విజయనగరం (D)కి చెందిన వినయ్ పురుషోత్తపురంలో ఉంటూ విశాఖలోని ఓ కాలేజీలో చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. వినయ్ తన మిత్రుడు ఉదయ్‌తో తిరిగొస్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీకొంది. ఈ ప్రమాదంలో వినయ్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయ్‌ చికిత్స్ పొందుతున్నాడు.