News July 25, 2024
స్థలం కేటాయించాకే రైల్వే జోన్ పనులు: కేంద్రమంత్రి
విశాఖలో జీవీఎంసీ అధికారులు తగిన స్థలం కేటాయించిన తరువాతే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు ప్రారంభం అవుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్పష్టం చేశారు. 2024-25 రైల్వే బడ్జెట్‌కు సంబంధించి ఆయన మాట్లాడుతూ.. విశాఖ జిల్లా అధికారుల వల్లే జోన్ పనులు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. ఈ బడ్జెట్‌లో తూర్పు కోస్తా రైల్వే జోన్ ఉన్న ఒడిశా రాష్ట్రానికి రూ.10,586 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
Similar News
News October 8, 2024
విశాఖలో కార్పొరేటర్‌పై రౌడీ షీట్
జీవీఎంసీ 60వ వార్డు కార్పొరేటర్ పీవీ సురేశ్‌పై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. వైసీపీకి చెందిన సురేశ్‌పై అనేక కేసులు నమోదు అయినట్లు మల్కాపురం పోలీసులు తెలిపారు. సొంత పార్టీ నాయకుల ఫిర్యాదుతోనే నాలుగు కేసులు ఆయనపై నమోదయ్యాయి. దురుసుగా ప్రవర్తించడం, దుర్భాషలాడడంతో ఆయనపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
News October 8, 2024
విశాఖ: టెట్ పరీక్షకు 84 శాతం మంది హాజరు
జిల్లాలో సోమవారం నిర్వహించిన టెట్ పరీక్షకు 84.36 శాతం మంది హాజరైనట్లు డీఈవో చంద్రకళ తెలిపారు. ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 4610 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 3889 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఉదయం 5 పరీక్ష కేంద్రాల్లోనూ మధ్యాహ్నం 5 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్లు వివరించారు. తాను ఒక పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేయగా ఫ్లయింగ్ స్క్వాడ్ 2 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు.
News October 7, 2024