News March 22, 2025
స్థల వివాదంతోనే హత్య: ఎస్సై జగన్మోహన్

బండి ఆత్మకూరు మండలం జి.లింగాపురం గ్రామంలో నంద్యాల సుధాకర్ రెడ్డిని దారుణ హత్య చేసిన విషయం తెలిసిందే. సుధాకర్ రెడ్డి, గుర్రాల రామ స్వామిలకు ఇంటి స్థలం విషయంలో మనస్పర్థలు ఉన్నాయని, దాని కారణంగానే దారుణ హత్య చేశారని ఎస్సై జగన్మోహన్ తెలిపారు. ఇది రాజకీయ హత్య కాదని స్పష్టం చేశారు. గుర్రాల రామస్వామి, అతడి ఇద్దరు కుమారులు గుర్రాల శివ, గుర్రాల తిరుపాలు కలిసి హత్య చేశారని చెప్పారు.
Similar News
News December 1, 2025
మనకోసం మనకంటే ముందుగా (2/2)

1960లో స్పుత్నిక్5తో వెళ్లిన డాగ్స్ బెల్కా, స్ట్రెల్కా తిరిగొచ్చాయి. మనుషులు స్పేస్ జర్నీ చేయగలరని వీటితోనే తెలిసింది. 1961లో నాసా ఓ చింపాంజీని పంపి మెదడు పనితీరు పరిశీలించింది. నరాల పనితీరుపై అధ్యయనం కోసం France 1963లో పిల్లిని, 2007లో యురోపియన్ స్పేస్ ఏజెన్సీ వాటర్ బేర్‌ను పంపింది. స్పేస్‌లో ఆక్సిజన్ కొరత, రేడియేషన్‌ను ఇవి తట్టుకున్నాయి.
-1961: యూరి గగారిన్ స్పేస్‌లోకి వెళ్లిన తొలి మనిషి
News December 1, 2025
అధికారుల వాట్సాప్ గ్రూప్‌లో బాపట్ల రైతులు..!

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు వారి సమస్యలను ఉన్నతాధికారులకు చెప్పుకునేందుకు రైతులతో కూడిన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రైతులు వారి సమస్యలను వాట్సాప్ గ్రూప్‌లో పెట్టే విధంగా అవగాహన కల్పించాలన్నారు. సోమవారం ఆయన వ్యవసాయ శాఖ అధికారుల సమావేశంలో సూచించారు.
News December 1, 2025
జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు: పోలీస్ కమిషనర్

గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. అర్ధరాత్రి సమయాల్లో అనుమానిత వ్యక్తుల వివరాలు, వేలిముద్రలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్‌ను పటిష్టంగా అమలు చేస్తేనే నేరాలు నియంత్రణలో ఉంటాయని, గస్తీ, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేస్తున్నారని ఆయన తెలిపారు.


