News March 23, 2025
స్థల వివాదంతోనే హత్య: ఎస్సై జగన్మోహన్

బండి ఆత్మకూరు మండలం జి.లింగాపురం గ్రామంలో నంద్యాల సుధాకర్ రెడ్డిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. సుధాకర్ రెడ్డి, గుర్రాల రామ స్వామిలకు ఇంటి స్థలం విషయంలో మనస్పర్థలు ఉన్నాయని, దాని కారణంగానే దారుణ హత్య చేశారని ఎస్సై జగన్మోహన్ తెలిపారు. ఇది రాజకీయ హత్య కాదని స్పష్టం చేశారు. గుర్రాల రామస్వామి, అతడి ఇద్దరు కుమారులు గుర్రాల శివ, గుర్రాల తిరుపాలు కలిసి హత్య చేశారని చెప్పారు.
Similar News
News April 24, 2025
చిత్తూరు: ఒకేసారి తండ్రి, కుమార్తె పాస్

చిత్తూరు జిల్లా రొంపిచర్ల పంచాయతీ పాలెం వీధికి చెందిన తండ్రి, కుమార్తె ఒకేసారి పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యారు. 1995-96లో 10వ తరగతి పరీక్షలు రాసిన బి.షబ్బీర్ ఫెయిలయ్యారు. అప్పట్లో ప్రమాదవశాత్తు గాయపడి దివ్యాంగుడిగా మారారు. ఏదైనా ఉద్యోగం సాధించాలనే తపనతో తన కుమార్తె బి.సమీనాతో కలిసి పదో తరగతి పరీక్షలు రాశారు. షబ్బీర్‌కు 319, కుమార్తె సమీనాకు 309 మార్కులు రావడం విశేషం.
News April 24, 2025
మే 20న అంగన్వాడీల సమ్మె

AP: వేతనాల పెంపుతో పాటు వేసవి సెలవులు, సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మే 20న రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది. లబ్ధిదారులకు అందించే సరుకులన్నీ విడతల వారీగా కాకుండా ఒకేసారి ఇవ్వాలని, ఫేస్ యాప్ ఇన్, ఔట్ లొకేషన్ తొలగించాలని వారు కోరుతున్నారు.
News April 24, 2025
జాబ్ కోసం తిరుగుతున్నారా? గుంటూరులోనే మీకు గోల్డెన్ ఛాన్స్!

గుజ్జనగుండ్లలోని ఉపాధి కార్యాలయంలో ఈ నెల 25న జాబ్ మేళా జరగనుంది. ప్రముఖ సంస్థలు ఉద్యోగుల నియామకానికి ముందుకొస్తుండగా, పదోతరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు అర్హులు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి మంగళవారం తెలిపారు. తమ బయోడేటా, విద్యాసర్టిఫికెట్లు, ఆధార్, ఫోటోతో రావాలని ఆమె సూచిస్తున్నారు.