News February 5, 2025
స్థానిక ఎన్నికలకు సిద్ధం అవ్వండి: మాజీ ఎమ్మెల్యే

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని, ఎన్నికల్లో BRS జెండా ఎగరవేయాలని నాయకులు, కార్యకర్తలకు మాజీ MLA సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల్లో ఉండాలని, ప్రజా సమస్యలపై పోరాడుతూ వారికి అండగా నిలవాలని సూచించారు. నిన్న హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో అందరికీ అవకాశాలు ఉంటాయని, నాయకులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
Similar News
News October 24, 2025
NLG: సీసీఐ కొనుగోలు కేంద్రాల వివరాలు!

జిల్లా వ్యాప్తంగా ఇవాళ 9 CCI కొనుగోలు కేంద్రాలను మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రారంభించనున్నారు. ఇందులో సలపార్ కాటన్ మిల్ చండూరు, వరలక్ష్మి కాటన్ మిల్ చిట్యాల, శ్రీలక్ష్మినర్సింహ్మ ఆగ్రో ఇండస్ట్రీ మాల్ ఏ, శివగణేష్ కాటన్ మిల్ మాల్ బీ, శివగణేష్ కాటన్ మల్లేపల్లి ఏ, తిరుమల కాటన్ మిల్ మల్లేపల్లి బీ, శ్రీనాథ్ కాటన్ మిల్ NKL, సత్యనారాయణ కాటన్ మిల్ NLG, TRR కాటన్ మిల్ శాలిగౌరారం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి.
News October 24, 2025
NLG: పత్తి రైతులకు మార్కెటింగ్ ఏడీ కీలక సూచన

జిల్లాలో పత్తి రైతులకు జిల్లా మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఛాయాదేవి కీలక సూచన చేశారు. సీసీఐ కేంద్రాలకు రైతులకు తీసుకొచ్చే పత్తిలో తేమశాతం 8 నుంచి 12 వరకు ఉండేలా ఆరబెట్టాలని తెలిపారు. తేమశాతం తక్కువ ఉంటేనే ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.8100 చెల్లిస్తుందన్నారు. స్లాట్ బుక్ చేసుకున్నాక పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలని సూచించారు.
News October 24, 2025
NLG: సర్కార్‌కు ఈసారి రూ.5.77 కోట్ల అదనపు ఆదాయం

ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్ల గడువు పెంచినా.. కేవలం 256 దరఖాస్తులు మాత్రమే పెరిగాయి. 2023లో 7,057 దరఖాస్తులు రావడంతో అప్పుడు డిపాజిట్ ఫీజు రూ.2 లక్షలు ఉండగా రూ.141.41 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఈసారి టెండర్ ఫీజు రూ.3 లక్షలకు పెంచినప్పటికీ రూ.147.18 కోట్ల ఆదాయమే సమకూరింది. గతంతో పోలిస్తే ఈసారి సర్కారుకు జిల్లా నుంచి కేవలం రూ.5.77 కోట్ల ఆదాయమే అదనంగా వచ్చింది.


