News February 10, 2025
స్థానిక ఎన్నికలు.. గద్వాల జిల్లా పూర్తి వివరాలు

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లా అధికారులు, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన గద్వాల జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలు, 4 మున్సిపాలిటీలు,13 మండలాలు ఉన్నాయి. ఎర్రవల్లి కొత్త మండలం ఏర్పాటుతో ZPTC, MPP పదవులు, ఒక MPTC స్థానం పెరగనున్నాయి. ప్రస్తుతం జడ్పీటీసీ-13, ఎంపీపీ-13 ఎంపీటీసీ-141, గ్రామ పంచాయతీలు 255 ఉన్నాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.
Similar News
News December 23, 2025
ADB: డాక్యుమెంట్ రైటర్‌పై కేసులు

ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తున్న సుభాష్ నగర్‌కు చెందిన వెన్నం నవీన్ పై 2 కేసులు నమోదు చేసినట్లు 2టౌన్ CI నాగరాజు తెలిపారు. సదానందం 2023లో కొనుగోలు చేసిన ప్లాటుకు సంబంధించిన దస్తావేజుల్లో హద్దులు సరిచేసి ఇవ్వటానికి రూ.లక్ష తీసుకున్నాడు. అదే విధంగా మరొకరి దగ్గర దస్తావేజుల్లోనూ మార్పులు చేయటానికి రూ.56వేలు తీసుకొని ఇబ్బందులకు గురిచేయగా బాధితులు ఫిర్యాదు చేశారు.
News December 23, 2025
FLASH: డ్రంక్ అండ్ డ్రైవ్ రిపోర్ట్ విడుదల..!

HYD ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల రిపోర్ట్ విడుదల చేశారు. HYD పోలీసుల నివేదిక ప్రకారం.. డిసెంబర్ 15 నుంచి 21 మధ్య 1,102 కేసులు నమోదయ్యాయి. ఇందులో ద్విచక్ర వాహనదారులే ఎక్కువ. 21–40 ఏళ్ల యువత అధికంగా పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. మద్యం డ్రైవింగ్ ప్రమాదాలకు, ప్రాణ నష్టాలకు కారణమవుతోందన్నారు.
News December 23, 2025
30ఏళ్లు దాటితే బెల్లీ ఫ్యాట్.. కారణం తెలుసా?

30ఏళ్లు దాటిన తర్వాత మెటబాలిజంలో మార్పులొస్తాయి. ప్రతి పదేళ్లకు ఒకసారి శరీరంలో కండరాల సాంద్రత తగ్గుతుంది. దీంతో రెస్ట్ తీసుకునేటప్పుడు శరీరం ఖర్చు చేసే కేలరీల సంఖ్య తగ్గుతుంది. టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ 4-5% పడిపోయి శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. డైట్, జీవనశైలిలో మార్పులు లేకున్నా బెల్లీ ఫ్యాట్ ఫార్మ్ అవుతున్నట్టు తాజా స్టడీలో వెల్లడైంది.


