News February 7, 2025
స్థానిక ఎన్నికలు: జనగామ జిల్లా పూర్తి వివరాలు

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన జనగామ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు 3, మున్సిపాలిటీలు 2 ఉన్నాయి. ఇదిలా ఉంటే ZPTC-12, MPP-12, MPTC-193, గ్రామ పంచాయతీలు-280, వార్డులు 2534 ఉన్నాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.
Similar News
News December 22, 2025
వంటింటి చిట్కాలు మీకోసం

* పంచదార డబ్బాలో కొన్ని లవంగాలు వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి.
* అల్లం, వెల్లుల్లి ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే పేపర్ బ్యాగ్లో పెట్టి ఫ్రిజ్లో ఉంచాలి.
* పెనాన్ని రెండు గంటలపాటు వేడినీటిలో ఉంచి తర్వాత నిమ్మ చెక్కతో రుద్దితే జిడ్డు వదిలి పోతుంది.
* గారెలు, బూరెలు వంటివి చేసేటప్పుడు నూనె చిందకుండా ఉండాలంటే నూనెలో కాస్త నెయ్యి వేస్తే సరిపోతుంది.
News December 22, 2025
‘ధురంధర్’ కలెక్షన్లు ఎంతో తెలుసా?

రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురందర్’ మూవీ కలెక్షన్లలో దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటివరకు రూ.790.75 కోట్లు వసూలు చేసినట్లు INDIA TODAY తెలిపింది. ఇవాళ రూ.800 కోట్లు క్రాస్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు కేవలం ఇండియాలోనే ఈ మూవీ రూ.555.5 కోట్ల నెట్ సాధించినట్లు వెల్లడించి. దీంతో యానిమల్ లైఫ్ టైమ్ కలెక్షన్ల(రూ.553 కోట్లు)ను దాటేసిందని పేర్కొంది.
News December 22, 2025
గౌరు చరితకు అనుకోని అవకాశం

నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి అనూహ్యంగా దక్కింది. సుమారు 12 మంది నేతలు పోటీ పడగా ఒక దశలో ధర్మవరం సుబ్బారెడ్డి అధ్యక్షుడిగా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. ఆఖరి నిమిషంలో చరితకు అవకాశం దక్కింది. మరోవైపు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. ఆయనను దీటుగా ఎదుర్కొనేలా వ్యూహాత్మకంగా సీఎం చంద్రబాబు చరితను నియమించినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.


