News February 7, 2025

స్థానిక ఎన్నికలు: జనగామ జిల్లా పూర్తి వివరాలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన జనగామ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు 3, మున్సిపాలిటీ‌లు 2 ఉన్నాయి. ఇదిలా ఉంటే ZPTC-12, MPP-12, MPTC-193, గ్రామ పంచాయతీలు-280, వార్డులు 2534 ఉన్నాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో‌ గ్రామాల్లో సందడి నెలకొంది.

Similar News

News February 11, 2026

హుజురాబాద్‌లో 81.47% పోలింగ్ నమోదు

image

హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి 81.47% శాతం పోలింగ్ నమోదైంది. గత 2020ఎన్నికల్లో నమోదైన 77.8 శాతంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా తరలివచ్చారు. వృద్ధులు, మహిళలు, యువత ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించారు. పోలింగ్ శాతం పెరగడం ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగినట్లు సూచిస్తోందని అధికారులు తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా పూర్తయ్యాయని చెప్పారు.

News February 11, 2026

కరీంనగర్: ‘అభ్యర్థి సస్పెన్షన్ వార్తల్లో నిజం లేదు’

image

కరీంనగర్ నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 242వ బూత్‌లో ఓ అభ్యర్థిని రిటర్నింగ్ అధికారి సస్పెండ్ చేశారంటూ సాగుతున్న ప్రచారపై కమిషనర్ ప్రపుల్ దేశాయ్ వివరణ ఇచ్చారు. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, రిటర్నింగ్ అధికారి ఎవరిని సస్పెండ్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు వార్తలను నమ్మవద్దని, పోలింగ్ ప్రక్రియ సజావుగానే సాగిందని తెలిపారు.

News February 11, 2026

జగిత్యాల: 2 రోజుల పాటు ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాలకు సెలవు

image

జగిత్యాల ఎస్‌కేఎన్‌ఆర్ ప్రభుత్వ సైన్స్ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశాల మేరకు 12, 13 ఫిబ్రవరి 2026 తేదీలలో కళాశాలకు సెలవులు ప్రకటించినట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ.అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా బోధనా, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు గమనించాలని, సంబంధిత సమాచారాన్ని విద్యార్థులకు తప్పనిసరిగా తెలియజేయాలని సూచించారు.