News February 7, 2025

స్థానిక ఎన్నికలు: మహబూబాబాద్ జిల్లా వివరాలు

image

స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు 2, మున్సిపాలిటీ‌లు 4 ఉన్నాయి. ఇదిలా ఉంటే ZPTC-18, MPP-18, MPTC-193, గ్రామ పంచాయతీలు-497, వార్డులు 47,548 ఉన్నాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో‌ గ్రామాల్లో సందడి నెలకొంది.
* నోట్: ఇంకొన్ని పెరిగే అవకాశం ఉంది.

Similar News

News December 13, 2025

బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలివే..

image

40 ఏళ్లు దాటిన మహిళలు ఎప్పటికప్పుడు బ్రెస్ట్‌లో వచ్చే మార్పులను గమనిస్తుండాలని నిపుణులు సూచిస్తున్నారు. రొమ్ములో కొంత భాగం గట్టిపడటం, రొమ్ము చర్మం రంగు మారడం, చను మొన ప్రాంతంలో పుండ్లు, బ్రెస్ట్ నుంచి స్రావాలు రావడం, చంకల కింద గడ్డలు కనిపించడం అనేవి బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాథమిక లక్షణాలు. కాబట్టి రొమ్ముల్లో ఏవైనా అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

News December 13, 2025

మంగళగిరి: ఆ అధికారి ఆఫీసుకు వచ్చి ఏడాది దాటింది!

image

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (మంగళగిరి) కార్యాలయం సబార్డినేటర్ మహ్మద్ ఫజల్-ఉర్-రహమాన్ విధులకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో సహాయ సంచాలకులు సీరియస్ అయ్యారు. గతేడాది జూన్ నుంచి నేటి వరకు ఎటువంటి అనుమతి లేకున్నప్పటికీ విధులకు హాజరు కావడం లేదని చెప్పారు. ఇప్పటి వరకు 3 సార్లు నోటీసులు జారీచేసినప్పటికీ స్పందించలేదన్నారు. 15 రోజుల లోపులిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని, లేకుంటే సర్వీస్ నుంచి తొలగిస్తామన్నారు.

News December 13, 2025

NLG: గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

ఉమ్మడి NLG జిల్లాలో SC, ST, BC, జనరల్ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను విడుదలైంది.

✓​దరఖాస్తు స్వీకరణ: 11-12-2025 నుంచి 21-01-2026 వరకు.

✓​పరీక్ష తేదీ: 22-02-2026.

​దరఖాస్తు ఫీజు: రూ.100/-

✓ పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకోవడానికి https://tgcet.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

-SHARE IT