News February 7, 2025
స్థానిక ఎన్నికలు: మహబూబాబాద్ జిల్లా వివరాలు

స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు 2, మున్సిపాలిటీలు 4 ఉన్నాయి. ఇదిలా ఉంటే ZPTC-18, MPP-18, MPTC-193, గ్రామ పంచాయతీలు-497, వార్డులు 47,548 ఉన్నాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.
* నోట్: ఇంకొన్ని పెరిగే అవకాశం ఉంది.
Similar News
News March 15, 2026
విశాఖ: టెన్త్ పరీక్షలు రాసేవారికి బస్సులో ఉచిత ప్రయాణం

పదో తరగతి పరీక్షల దృష్ట్యా, విద్యార్థులు హాల్ టికెట్ చూపి ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని విశాఖ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు ప్రకటించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం, మధ్యాహ్నం వేళల్లో అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేలా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News March 15, 2026
గ్యాస్ కోసం ఆందోళన అవసరం లేదు: విశాఖ జేసీ

విశాఖ జిల్లాలో గ్యాస్ కొరత లేదని జేసీ విద్యాధరి ఆదివారం తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం గ్యాస్ బుకింగ్‌నకు రోజువారీ అవసరము 18,184 సిలిండర్‌లు కాగా 37,920 సిలిండర్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్యాస్ కొరతపై వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని సూచించారు. అవసరమైనప్పుడు మాత్రమే సిలిండర్ బుకింగ్ చేసుకోవాలనన్నారు. కేవలం పుకార్ల వల్ల మాత్రమే బుకింగ్స్ పెరిగాయని ఆమె పేర్కొన్నారు.
News March 15, 2026
నిబంధనల మేరకు పక్కాగా సర్వే నిర్వహించాలి: కలెక్టర్

ప్రభుత్వం సూచించిన విధంగా నిబంధన ప్రకారం క్షేత్రస్థాయిలో అధికారులు పక్కాగా సర్వే నిర్వహించి, జనాభా గణన చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో జనాభా లెక్కలు – 2027, శిక్షణ తరగతుల్లో ఆమె మాట్లాడారు. మొదటి దశ హౌసింగ్ లిస్ట్ మే 11 నుంచి జూన్ 9, రెండో దశ 2027 ఫిబ్రవరిలో జరుగుతుందన్నారు. మార్చి 1, 2027 రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తామన్నారు.


