News January 30, 2025
స్థానిక ఎన్నికల్లో సమరానికి ప్రజారాజ్యం సిద్ధం: రవికుమార్

చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర రవికుమార్ మాట్లాడారు. స్థానిక సంస్థలు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో సమరానికి ప్రజారాజ్యం సిద్ధమని అన్నారు. యువతకు ప్రాధాన్యం ఇస్తామని.. కాంగ్రెస్,బీజేపీ, బీఆర్ఎస్ను ఓడించే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దాసరి శ్యామ్ రావు, కర్ణాకర్ ఉదయ్ కుమార్, సామెల్ రాజ్ దేవయ్య ఉన్నారు.
Similar News
News December 16, 2025
ఈనెల 18 వరకు జిల్లాలో ఆంక్షలు అమలు: SP

మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 18 వరకు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. ఆదేశాల ప్రకారం నలుగురు, అంతకంటే ఎక్కువ గుంపులుగా చేరడం, ర్యాలీలు, సమావేశాలు, సభలు నిర్వహించడం పూర్తిగా నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
News December 15, 2025
చేగుంట శివారులో మృతదేహం గుర్తింపు

మెదక్ జిల్లా చేగుంట గ్రామ శివారులోని రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రైల్వే స్టేషన్ పక్కన ఉన్న బాలాజీ వెంచర్లో సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి విచారణ చేపట్టారు. మృతుడు ఎవరు, ఎలా మరణించాడు అనే వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
News December 15, 2025
జిల్లాను ఓటింగ్లో టాప్లో ఉంచాలి: కలెక్టర్

శత శాతం ఓటింగ్లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గత విడత ఎన్నికల్లో రాష్ట్రంలో మెదక్ జిల్లా 5వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. మూడో విడత ఎన్నికల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు.


