News March 27, 2025

స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

image

అల్లూరి జిల్లాలో రెండు మండల పరిషత్, ఒక పంచాయతీలో ఏర్పడిన ఖాళీలకు ఉపఎన్నికల నిర్వహణ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన నోటిఫికేషన్ మేరకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత ఎంపీడీవోలను కలెక్టర్ దినేశ్ కుమార్ బుధవారం ఆదేశించారు. రాజీనామాల వలన ఖాళీ అయిన జీ.మాడుగుల మండల అధ్యక్ష పదవి, గెమ్మెలి పంచాయతీ ఉప సర్పంచ్ పదవికి, సభ్యుని మృతి వలన ఏర్పడిన చింతూరు మండల కో-ఆప్షన్ సభ్యుని పదవికి ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News December 23, 2025

పాడేరు: WOW.. అద్భుతం ఈ PHOTO

image

పాడేరు సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వంజంగి మేఘాల కొండ హిమగిరి సొగసును తలపిస్తోంది. హిమాలయ పర్వతాలను తలపిస్తోన్న వంజంగి మేఘాల కొండ అందాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వరుసగా గుట్టలు, పర్వతాలు, వాటిపై పాల సముద్రాన్ని తలపించే మంచు మేఘాలు చూపరులను కట్టి పడేస్తున్నాయి. దీనికి సంబంధించిన పై ఫొటో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది.

News December 23, 2025

ప్రమాదంలో మృతి చెందిన యువకుడు ఇతనే..!

image

కర్లపాలెం మండలం పేరలి మంచినీళ్ల చెరువు సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. యువకుడు చీరాల మండలం పేరాలకు చెందిన నానిగా గుర్తించారు. నాని పాతపాలెంలో ఉన్న తన సోదరిని పరామర్శించి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంచినీళ్ల చెరువు వద్దకు చేరుకోగానే బైక్ అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో మృతి చెందాడు.

News December 23, 2025

సిద్దిపేట: ‘ర్యాలీలు, ధర్నాలకు అనుమతి తప్పనిసరి’

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేపట్టవద్దని పోలీస్ కమిషనర్ ఎస్ఎం విజయ్ కుమార్ సూచించారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 8 వరకు కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు. అనుమతి లేకుండా బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, బంద్‌లు చేపట్టవద్దని, ఏదైనా అత్యవసరమైతే పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు.